ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లాక్‌ హెడ్స్‌ వదిలించుకుందాం...

ABN, First Publish Date - 2021-05-16T05:42:00+05:30

ముఖ సౌందర్యాన్ని దెబ్బతీసే సమస్యల్లో బ్లాక్‌ హెడ్స్‌ ఒకటి. ఇవి ఎక్కువగా ముక్కు మీద కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ వస్తూ ఆందోళన కలిగిస్తాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముఖ సౌందర్యాన్ని దెబ్బతీసే సమస్యల్లో బ్లాక్‌ హెడ్స్‌ ఒకటి. ఇవి ఎక్కువగా ముక్కు మీద కనిపిస్తూ ఉంటాయి.  మళ్ళీ మళ్ళీ వస్తూ ఆందోళన కలిగిస్తాయి. అయితే ఇంట్లో ఉండే వస్తువులతో సహజ సిద్ధంగా వీటిని తొలగించుకోవచ్చు. ఎలాగంటే...


  1. చిటికెడు పసుపును పచ్చి పాలలో కలిపి, ముఖానికి రాసుకోండి. కాసేపటి తరువాత కడిగెయ్యండి. 
  2. ఒక టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడాను రెండు టేబుల్‌ స్పూన్ల నీటితో కలపండి. ఆ మిశ్రమాన్ని బ్లాక్‌ హెడ్స్‌ ఉన్న చోట పూయండి. పదిహేను నుంచి ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి.
  3. కోడిగుడ్డులోని తెల్ల సొనను ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో కలపండి. దాన్ని ముఖానికి రాసుకోండి. పూర్తిగా ఎండిన తరువాత నీటితో కడగండి.
  4. ఒక టేబుల్‌ స్పూన్‌ గ్రీన్‌ టీ ఆకులను నీటితో కలిపి చిక్కటి ముద్దలా చెయ్యండి. దాన్ని బ్లాక్‌ హెడ్స్‌ ఉన్న ప్రదేశంలో పూసి, ఇరవై నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోండి.


ఇలా కొన్ని రోజులు చేస్తే బ్లాక్‌ హెడ్స్‌ను పూర్తిగా తొలగించుకోవడమే కాదు, మళ్ళీ రాకుండా నివారించుకోవచ్చు.


Updated Date - 2021-05-16T05:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising