ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా చేసి చూడండి!

ABN, First Publish Date - 2021-02-08T05:37:28+05:30

వేపాకులను మజ్జిగతో మెత్తగా రుబ్బి ఆ పేస్టును కాలిన గాయాలపై రాస్తే సాంత్వన లభిస్తుంది. కప్పు నీళ్లల్లో గుప్పెడు తులసి ఆకులు, చెంచా మిరియాలపొడి వేసి మరిగించాలి. ఆ తర్వాత అందులో రవ్వంత తేనె లేదా పంచదార కలిపి తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. వేపాకులను మజ్జిగతో మెత్తగా రుబ్బి ఆ పేస్టును కాలిన గాయాలపై రాస్తే సాంత్వన లభిస్తుంది.
  2. కప్పు నీళ్లల్లో గుప్పెడు తులసి ఆకులు, చెంచా మిరియాలపొడి వేసి మరిగించాలి. ఆ తర్వాత అందులో రవ్వంత తేనె లేదా పంచదార కలిపి తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
  3. ఎండలో బాగా తిరగడం వల్ల తలనొప్పిగా ఉంటే చిన్న అల్లంముక్కను నూరి నిమ్మరసంతో తాగితే ఉపశమనంగా ఉంటుంది. 
  4. మతిమరుపుతో ఇబ్బందిపడుతున్న వాళ్లు తేనె తరచూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
  5. మధుమేహంతో బాధపడేవారు నిత్యం ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే మంచిది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లిపాయలను తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగులు తగ్గుతాయి. 
  6. ఆరువంతుల నారింజరసానికి ఒక వంతు క్యారట్‌ రసం, ఒక వంతు నిమ్మరసం చేర్చి ఆ మిశ్రమాన్ని సగం కప్పు రోజూ తాగితే నరాల బలహీనత తగ్గుతుంది.
  7. కొబ్బరినూనె, నిమ్మరసాలను సమపాళ్లల్లో తీసుకుని పేస్టులా చేసి దాన్ని మోకాళ్లకు రాసుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి. 
  8. తేనెటీగ కుడితే దానిపై ఉల్లిపాయ రసం పూయాలి. అలా చేస్తే ఆ ప్రాంతంలో వాపు, నొప్పి తగ్గుతాయి.  
  9. అరికాళ్లు మంటలుగా ఉంటే నెయ్యి లేదా సొరకాయగుజ్జు రాస్తే ఉపశమనంగా ఉంటుంది. 

Updated Date - 2021-02-08T05:37:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising