ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాజికాయతో ఆరోగ్యం

ABN, First Publish Date - 2021-05-15T05:30:00+05:30

సుగంధద్రవ్యమైన జాజి కాయలో ఆరోగ్యానికి తోడ్పడే సుగుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధకశక్తి పెంచడంతో పాటు, మరెన్నో రుగ్మతలను తగ్గిస్తుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుగంధద్రవ్యమైన జాజి కాయలో ఆరోగ్యానికి తోడ్పడే సుగుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధకశక్తి పెంచడంతో పాటు, మరెన్నో రుగ్మతలను తగ్గిస్తుంది.

  • కప్పు వేడి పాలలో అర టీస్పూను తేనె, చిటికెడు యాలకుల పొడి, రెండు చిటికెల జాజి కాయ పొడి కలిపి తాగితే రోగనిరోధకశక్తి పెరగడంతో పాటు కమ్మని నిద్ర పడుతుంది.
  • జాజి కాయలో ఉండే మైరిస్టిసిన్‌, ఎలిమిసిన్‌, యూజినాల్‌, సఫ్రోల్‌ అనే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి. ఈ పొడిని పాలతో కలిపి తీసుకోవాలి.
  • జాజి కాయ తినడం వల్ల జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. దీన్లోని పీచు మలబద్ధకాన్ని తొలగిస్తుంది. కడుపు ఉబ్బరం సమస్య కూడా జాజి కాయతో తగ్గుతుంది. కాబట్టి దీన్ని వంటకాల్లో తరచుగా వాడుతూ ఉండాలి.
  • జాజికాయలోని యూజినాల్‌ అనే ఎసెన్షియల్‌ ఆయిల్‌ పంటి నొప్పిని తగ్గిస్తుంది.
  • తేనె చేర్చి తయారుచేసిన జాజి కాయ కషాయం వాంతులకు విరుగుడుగా పని చేస్తుంది.
  • జాజికాయ తినడం వల్ల పిత్తాశయం పనితీరు మెరుగై మధుమేహం అదుపులో ఉంటుందని ఎలుకల మీద చేపట్టిన ప్రయోగాల్లో తేలింది. కాబట్టి కేవలం మాంసాహార వంటకాలు, పిండి వంటల్లోనే కాకుండా కూరల్లో, అల్పాహారాల్లో జాజి కాయ వాడకం పెంచాలి. కషాయం రూపంలో, పాలతో కలిపి తీసుకుంటూ ఉండాలి. 

Updated Date - 2021-05-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising