ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టొమాటో జ్యూస్‌తో ఎముకలు దృఢం!

ABN, First Publish Date - 2021-05-16T05:37:24+05:30

ప్రతిరోజు రెండు గ్లాసుల టొమాటో జ్యూస్‌ తాగితే ఎముకలు దృఢంగా మారడమే కాకుండా అస్టియోపోరోసిస్‌ దరిచేరకుండా ఉంటుంది. టొమాటోలో ఉండే లైకోపీన్‌ అనే యాంటీఅక్సిడెంట్‌ ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతిరోజు రెండు గ్లాసుల టొమాటో జ్యూస్‌ తాగితే ఎముకలు దృఢంగా మారడమే కాకుండా అస్టియోపోరోసిస్‌ దరిచేరకుండా ఉంటుంది. టొమాటోలో ఉండే లైకోపీన్‌ అనే యాంటీఅక్సిడెంట్‌ ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుందని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటోకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడయింది. 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న అరవై మంది మెనోపాజ్‌ దశ దాటిన మహిళలపై ఈ పరిశోధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా వారి మెనూలో ఒక నెల రోజుల పాటు టొమాటో, టొమాటోతో చేసిన ఇతర పదార్థాలు ఏవీ లేకుండా చేశారు. అప్పుడు వారి రక్తంలో అంటే ఎముక విరిగే  సమయంలో విడుదలయ్యే ‘ఎన్‌-టెలొపెప్టైడ్‌’ అనే ఒకరకమైన కెమికల్‌ స్థాయిలు పెరగడాన్ని గమనించారు. ఆ తరువాత వారికి వరుసగా నాలుగు నెలలపాటు 15 ఎంజీ లైకోపీన్‌ ఉన్న టొమాటో జ్యూస్‌ను అందించారు. అప్పుడు మళ్లీ పరిశీలించగా ఎన్‌-టెలొపెప్టైడ్‌ లెవెల్స్‌ చాలా వరకు తగ్గిపోయాయి. దీన్నిబట్టి టొమాటో తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.


Updated Date - 2021-05-16T05:37:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising