ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రీన్‌ టీ తాగుతున్నారా...

ABN, First Publish Date - 2021-05-16T05:30:00+05:30

గ్రీన్‌ టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. శరీరం మెటబాలిజాన్ని గ్రీన్‌ టీ పెంచుతుంది. తద్వారా క్యాలరీలు ఎక్కువగా ఖర్చై, శరీరం బరువు తగ్గుతుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రీన్‌ టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. శరీరం మెటబాలిజాన్ని గ్రీన్‌ టీ పెంచుతుంది. తద్వారా క్యాలరీలు ఎక్కువగా ఖర్చై, శరీరం బరువు తగ్గుతుంది. ఇంకా ఎన్నో విధాలుగా మేలు చేకూర్చే గ్రీన్‌ టీని తాగేవారు ప్రధానం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి... 


పరగడుపునే తాగకండి: గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, రోగ నిరోధకశక్తిని పటిష్టం చేసే పాలీఫెనాల్స్‌ ఎక్కువ. పరగడుపునే గ్రీన్‌ టీ తాగితే వీటివల్ల పొట్టలో యాసిడ్ల ఉత్పత్తి పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఏదైనా తిన్న తరువాతనే గ్రీన్‌ టీ తాగండి.

మరీ వేడిగా తాగకండి: గ్రీన్‌ టీని చాలా వేడిగా తాగితే రుచి లేకుండా పోవడమే కాదు, పొట్టకు, గొంతుకు హాని కలుగుతుంది. గోరువెచ్చగా తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

భోజనం చేసిన వెంటనే వద్దు: ఆహారంలోని ప్రొటీన్లు జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. భోజనం చేసిన వెంటనే గ్రీన్‌ టీ తాగితే ఈ ప్రక్రియ దెబ్బ తింటుంది.

మందులతో పాటు వేసుకోకండి: ఏవైనా మందులు వేసుకొని, వెంటనే గ్రీన్‌ టీ తాగితే... మందులలో ఉన్న రసాయన మిశ్రమం గ్రీన్‌ టీతో కలిసి ఎసిడిటీకి దారి తీస్తుంది. కాబట్టి మందులను నీటితోనే వేసుకోండి. కొంత సమయం తరువాత గ్రీన్‌ టీ తాగినా పరవాలేదు.

వేణ్ణీళ్లలో ఎక్కువ సేపు ఉంచకండి:  గ్రీన్‌ టీ బ్యాగ్‌లను మరీ ఎక్కువ సేపు వేడి నీళ్ళలో ఉంచకండి. దీనివల్ల రుచి చేదుగా మారిపోతుంది. కషాయంలా తయారై, జీర్ణ ప్రక్రియ మీద దుష్ప్రభావం చూపిస్తుంది.


Updated Date - 2021-05-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising