ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భంతో ఉన్నప్పుడు కుంకుమ పువ్వు తీసుకోమనడానికి.. అసలు కారణాలు ఇవన్నమాట..!

ABN, First Publish Date - 2021-10-04T03:31:54+05:30

ప్రతి మహిళకూ తల్లి అవ్వాలని ఉంటుంది. అందుకోసం పురుటి నొప్పులను కూడా లెక్కచేయరు. ఇక గర్భిణిగా ఉన్న సమయంలో పుట్టబోయే పిల్లల గురించి ఆలోచిస్తూ.. అదే లోకంలో విహరిస్తూ ఉంటారు . అలాగే మరోవైపు డెలివరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి మహిళకూ తల్లి కావాలని ఉంటుంది. అందుకోసం పురిటి నొప్పులను కూడా లెక్కచేయరు. ఇక గర్భిణిగా ఉన్న సమయంలో పుట్టబోయే పిల్లల గురించి ఆలోచిస్తూ.. అదే లోకంలో విహరిస్తూ ఉంటారు. అలాగే మరోవైపు డెలివరీ సరిగానే అవుతుందా.. ఎలాంటి ఇబ్బందులు వస్తాయి.. బిడ్డ ఆరోగ్యంగానే పుడుతుందా.. ఇలా అనేక సందేహాలు వెంటాడుతుంటాయి. పిల్లల కోసం ఆలోచించే ఆ సమయంలో.. కొంత ఆరోగ్యం కోసం కూడా ఆలోచించాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు పోషకాహారం తీసుకోవడంతో పాటూ కుంకుమ పువ్వు కూడా విధిగా తీసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల బిడ్డ ఆరోగ్యంతో పాటూ ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తే సమస్యలను కూడా నివారిస్తుందట. అవేంటో చూద్దాం.. 


గర్భిణిగా ఉన్న సమయంలో తొమ్మిది నెలలూ కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. దీన్ని ఆయుర్వేద మందుల్లో కూడా ఎక్కువగా వాడతారు. పాత కాలం నుంచి గర్భిణులకు పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఇవ్వడం ఆనవాయితీ. ఈ పువ్వును తీసుకుంటే పిల్లలు మంచి రంగులో పుడతారని పెద్దలు అంటూ ఉంటారు. అయితే ఈ విషయం నిజమో, కాదో తెలీదు కానీ.. ఆరోగ్యపరంగా మాత్రం ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.


గర్భిణిగా ఉన్నప్పుడు.. వివిధ రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఒక్కోసారి చికాకు, ఆందోళన తదితర సమస్యలు వస్తూ ఉంటాయి. కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల వాటి నుంచి ఉపశమనంతో పాటూ ప్రశాంతత కూడా చేకూరుతుంది. అలాగే పొట్ట పెరిగే కొద్దీ నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. ఫలితంగా సరిగా నిద్ర పట్టదు. ఇలాంటి సమస్య పోవాలంటే గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వు కలిపి తీసుకోవాలి. అదేవిధంగా తిమ్మిర్లు, దురద తదితర సమస్యలకు ఇది బాగా పని చేస్తుంది.


గుండె పనితీరు మెరుగు పరిచి, దగ్గు, జలుబు వంటి అలర్జీల నుంచి రక్షిస్తుంది. అలాగే హిమోగ్లోబిన్‌ లెవెల్స్ పెరగడం వల్ల.. రక్తహీనతను నిరోధించడంతో పాటూ ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను పోగొడుతుంది. మరోవైపు పొటాషియం స్థాయిని పెంచుతుంది. అలాగే మొటిమలు, మచ్చలు తదితర సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు. అయితే, ఇన్ని ప్రయోజనాలు ఉన్న కుంకుమ పువ్వును.. మితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-10-04T03:31:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising