ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుప్పెడు బాదములు.. ఆరోగ్యానికి ఎంతో మేలు

ABN, First Publish Date - 2021-06-21T19:12:07+05:30

ప్రపంచ యోగా డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ ఆలోచనలను పంచుకున్నారు. ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా పౌష్టికాహార డైట్‌పైనా దృష్టి పెట్టాలంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ యోగా డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ ఆలోచనలను పంచుకున్నారు. ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా పౌష్టికాహార డైట్‌పైనా దృష్టి పెట్టాలంటున్నారు. ఓ గుప్పెడు బాదములను తమ రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవడం అందులో తొలి అడుగని అంటున్నారు. పౌష్టికాహార స్నాకింగ్‌ అవకాశంగా మాత్రమే అవి నిలువడంతో పాటుగా వాటిని తరచుగా తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తాయని తెలిపారు. గుండె ఆరోగ్యం మెరుగుపడటం, మధుమేహ నియంత్రణ, బరువు నియంత్రణ, చర్మ ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటుగా రోగ నిరోధక వ్యవస్థనూ ఆరోగ్యంగా ఉంచుతుందన్నారు.


నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ ‘‘ప్రతి రోజూ ఉదయం గుప్పెడు బాదములు పోషకాల గనిగా ఉండటమే కాక, అవసరమైన శక్తినీ అందిస్తాయి. వీటితో పాటుగా బాదములలో రాగి, జింక్‌, ఫోలెట్‌, ఐరన్‌, విటమిన్‌ ఈ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తికి తోడ్పాటునందించడం వల్ల నా డైట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థంగా మారింది’’ అని అన్నారు.


న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘బాదములలో ప్రోటీన్‌ అధికంగా ఉండటంతో పాటుగా డైటరీ ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యవంతమైన బ్లడ్‌ షుగర్‌ స్థాయి నిర్వహించడంలో సహాయపడటంతో పాటుగా టైప్‌ 2 మధుమేహంతో బాధపడుతున్న ప్రజలలో బ్లడ్‌ షుగర్‌ నియంత్రణకూ తోడ్పడుతుంది. అదే సమయంలో సాధారణంగా ఫాస్టింగ్‌ ఇన్సులిన్‌ స్థాయిపై ప్రభావం చూపే కార్బోహైడ్రేట్‌ ఫుడ్స్‌పై బ్లడ్‌ షుగర్‌ ప్రభావాన్ని సైతం తగ్గిస్తాయి’’ అని చెప్పారు.


ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌, సెలబ్రిటీ మాస్టర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ ‘‘బాదములలో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. మజిల్‌మాస్‌ వృద్ధి, నిర్వహణకు తోడ్పడే పోషకం ఇది. వర్కవుట్‌కు ముందు, తరువాత తినేందుకు అద్భుతమైన స్నాక్‌గా బాదం నిలుస్తుంది. వీటితో పాటుగా ఆకలిని తీర్చే వీటి గుణం కారణంగా భోజనాల నడుమ తీసుకునే స్నాక్‌గా తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలోనూ తోడ్పడుతుంది’’ అని అన్నారు.

Updated Date - 2021-06-21T19:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising