ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరజీవికి తలనొప్పిసాధారణం!

ABN, First Publish Date - 2021-06-07T05:30:00+05:30

నగరాల్లో నివిసించే వారిలో ప్రతి ఇద్దరిలో ఒకరు తలనొప్పితో బాధపడుతున్నారు. ఆ బాధ నుంచి ఉపశమనం కోసం మందుల షాపుల్లో పరుగులు పెడుతున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరాల్లో నివిసించే వారిలో ప్రతి ఇద్దరిలో ఒకరు తలనొప్పితో బాధపడుతున్నారు. ఆ బాధ నుంచి ఉపశమనం కోసం మందుల షాపుల్లో పరుగులు పెడుతున్నారు. ఇప్సోస్‌ హెల్త్‌కేర్‌ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయింది. సర్వేలో భాగంగా దేశంలోని 33 ప్రధాన నగరాల్లో 15133 మందిని పరిశీలించారు. వీరిలో ఎక్కువమందిలో తలనొప్పి ఉన్నట్టు తేలింది. దాంతోపాటు జ్వరం, తలనొప్పి, జలుబు, నోస్‌ బ్లాక్‌ వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉన్నట్లు వెల్లడయింది. నోటి సంరక్షణ, జలుబు దగ్గు, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు, నిద్రలేకపోవడం, ఒంటి నొప్పులు వంటి సమస్యలను రకరకాల కేటగిరీలుగా విభజించి సర్వే నిర్వహించారు. ఏ సమస్యతో బాధపడుతున్నారు? ఉపశమనం కోసం హోమ్‌రెమెడీస్‌ తీసుకుంటున్నారా? సెల్ఫ్‌ మెడికేషన్‌కు వెళుతున్నారా? డాక్టర్‌ను సంప్రదిస్తున్నారా? వంటి అంశాలను తెలుసుకున్నారు. ఇంట్లో థర్మామీటర్‌, బ్లడ్‌ గ్లూకోజ్‌ మానిటర్‌, బీపీ మానిటర్‌ ఉన్న వారి వివరాలు సేకరించారు. వైద్యుల కన్సల్టేషన్‌ ఫీజు ఎక్కువగా ఉండటం, సమయం లేకపోవడం, ప్రిస్కిప్షన్‌ లేకపోయినా మందులు లభిస్తుండటంతో చాలా మంది తెలిసిన మందులు వాడేస్తున్నట్లు సర్వేలో వెల్లడయింది. లాక్‌డౌన్‌ సమయంలో 7 శాతం మంది మాత్రమే డాక్టర్‌ను కలిసినట్టు వెల్లడించారు. డయాబెటిస్‌, బీపీ, ఆర్థరైటిస్‌, ఆస్తమాతో బాధపడుతున్న వారిలో 31 శాతం మంది క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తున్నట్టు తేలింది. 


Updated Date - 2021-06-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising