ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా యోధులకు హ్యాపీ కిట్‌!

ABN, First Publish Date - 2021-04-26T05:30:00+05:30

కరోనా వైర్‌సను తరిమేసేందుకు నిరతంరం శ్రమిస్తున్న వైద్యసిబ్బందికి చిన్న కానుకతో ధన్యవాదాలు చెప్పాలనుకున్నారు కర్ణాటకకు చెందిన దామిని శ్రీవాత్సవ. వృత్తిలో భాగంగా ఒత్తిడికి లోనయ్యే వారి ముఖాన చిరునవ్వులు పూయించాలనుకున్న ఈ యువతి చిరు ప్రయత్నం ఇది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైర్‌సను తరిమేసేందుకు నిరతంరం శ్రమిస్తున్న వైద్యసిబ్బందికి చిన్న కానుకతో ధన్యవాదాలు  చెప్పాలనుకున్నారు కర్ణాటకకు చెందిన దామిని శ్రీవాత్సవ. వృత్తిలో భాగంగా ఒత్తిడికి లోనయ్యే వారి ముఖాన చిరునవ్వులు పూయించాలనుకున్న ఈ యువతి చిరు ప్రయత్నం ఇది...


‘‘నా స్నేహితులలో కొందరు వైద్యరంగంలో ఉన్నారు. కరోనా సమయంలో వారు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో చూశాను. వారి సేవను అభినందించాలనుకున్నా. కాసేపైనా వారి ముఖాల్లో ఆనందం చూడాలనుకున్నా. ముఖ్యంగా ఆస్పత్రుల్లో పనిచేసే జూనియర్‌ స్టాఫ్‌, ఫ్లోర్‌ తుడిచే వాళ్లు, మార్చురీలో పనిచేసే వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకున్నా. అప్పుడే నాకు కెనాడాలోని టోరంటోలో ఉన్న ఒక ఆస్పత్రిలో తమ సిబ్బందికి ధన్యవాదాలు చెప్పేందుకు, వారిని తేలికపరిచేందుకు ‘కైండ్‌నెస్‌ కార్ట్‌’ మొదలెట్టారని తెలుసుకున్నాను. దాని స్ఫూర్తితోనే నాకు ‘హ్యాపీ కిట్స్‌’ ఆలోచన వచ్చింది’’ అంటున్నారు దామిని. 


క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు

కర్నాటకలోని ఉత్తరహళ్లికి చెందిన దామిని కరోనా సమయంలో ‘హ్యాపీ న్యూస్‌ ఆఫ్‌ ద డే’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సిరీస్‌ నడిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై విజయాన్ని చాటే పాజిటివ్‌ సందేశాలను ఎక్కువగా పోస్ట్‌ చేసేవారు. ఒక జర్నల్‌, స్కెచ్‌ పెన్నులు, రంగుల పుస్తకం, స్ట్రెస్‌ బాల్‌, స్వీట్లు, రిఫ్రె్‌షమెంట్స్‌తో కూడిన ఈ హ్యాపీ కిట్‌ ఉద్దేశం ఒత్తిడిని తగ్గించడం. ఇందులో మానసిక కౌన్సెలింగ్‌ ఇచ్చే వారి వివరాలు కూడా ఉంటాయి. తన ప్రయత్నంలో ఎక్కువ మందిని భాగం చేయాలని ‘మిలాప్‌’ వెబ్‌సైట్‌లో క్రౌండ్‌ఫండింగ్‌ ద్వారా దాదాపు రూ. 30వేలు సేకరించారు దామిని. ఈ డబ్బుతో వంద ‘హ్యాపీ కిట’్లను రూపొందించాలనే ఆలోచనలో ఉన్న ఆమె ఈ కిట్లను పంపిణీ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారి కోసం చూస్తున్నారు. స్థానిక ఆస్పత్రులతో సమన్వయం చేసుకుంటూ కరోనా మహమ్మారి నుంచి సమాజానికి రక్షణ కవచంగా ఉంటున్న వారిని గుర్తిస్తూ ముందుకెళుతున్న దామిని ప్రయత్నం ఎంతో అభినందనీయం.


Updated Date - 2021-04-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising