ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జుట్టు రాలడానికి చుండ్రే కారణమా?

ABN, First Publish Date - 2021-04-28T05:30:00+05:30

జుట్టు రాలిపోవడం అన్ని వయసులవారిలో కనిపించే సమస్యే. దీనికి ప్రధాన కారణం చుండ్రు అనే అపోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి జుట్టు ఎక్కువగా రాలిపోవడానికీ, కేశాలు నల్లబడడానికీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జుట్టు రాలిపోవడం అన్ని వయసులవారిలో కనిపించే సమస్యే. దీనికి ప్రధాన కారణం చుండ్రు అనే అపోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి జుట్టు ఎక్కువగా రాలిపోవడానికీ, కేశాలు నల్లబడడానికీ ప్రధాన కారణం ఒత్తిడి, ఆహారపు అలవాట్లు. అయితే చుండ్రు వల్ల కేశాలు రాలే పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయంటే...


చుండ్రు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్ళలో ఉన్న చర్మం ఎర్రబడుతుంది. దురద బాగా ఉంటుంది. దీన్ని భరించలేక తలను గోక్కున్నప్పుడు చిన్న గాయాలవుతాయి. జుట్టు కుదుళ్ళు దెబ్బతింటాయి. 

కురులు రాలిపోతాయన్న భయంతో కొందరు జుట్టు శుభ్రం చేసుకోవడం, తల స్నానం చెయ్యడం మానేస్తారు. ఇది క్రమంగా చుండ్రుకు దారి తీస్తుంది. 

కొందరిలో ఆండ్రోజెన్స్‌ అనే హర్మోన్లు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల చర్మంలో నూనె శాతం ఎక్కువవుతుంది. సోబోర్హెమిక్‌ డెర్మటైటిస్‌ అనే సమస్యకి దారితీస్తుంది. దీనివల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు. 

ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌, విటమిన్‌ లోపాలు, సోరియాసిస్‌ లాంటి సమస్యల వల్ల చుండ్రు రావచ్చు. ఈ సమస్యలు జుట్టు రాలడానికి దారితీస్తాయి. ఈ సమస్యలను నివారించుకుంటే ఇబ్బంది ఉండదు. 

కొద్ది స్థాయిలో చుండ్రు ఉన్నా దానివల్ల జుట్టు రాలడం ఉండదు. అయితే చుండ్రు ఎక్కువగా ఉన్నా, ఇతర చర్మ సమస్యలు ఉన్నా తగిన చికిత్స తీసుకోవాలి. 

Updated Date - 2021-04-28T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising