ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ను కనిపెట్టే గ్రాఫీన్‌ టెస్ట్‌

ABN, First Publish Date - 2021-06-22T05:30:00+05:30

విస్తృతంగా విజృంభించే కొవిడ్‌ కట్టడి కోసం, సత్వర ఫలితాన్ని అందించే కరోనా పరీక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విస్తృతంగా విజృంభించే కొవిడ్‌ కట్టడి కోసం, సత్వర ఫలితాన్ని అందించే కరోనా పరీక్షలు అవసరం. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా గ్రాఫీన్‌తో కరోనా వైరస్‌ను గుర్తించే వినూత్న ప్రయోగ ఫలితం ఒకటి వెలుగులోకి వచ్చింది.


యూనివర్శిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌, షికాగోకు చెందిన పరిశోధకులు సార్స్‌ సిఒవి - 2 వైరస్‌ను గుర్తించే గ్రాఫీన్‌ను కనుగొన్నారు. తమ ప్రయోగాల్లో పోస్టల్‌ స్టాంప్‌లో వెయ్యో వంతు పలుచగా ఉండే గ్రాఫీన్‌ షీట్లను యాంటీబాడీలతో కలిపి రూపొందించారు. ఇవి కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ను కనిపెట్టగలుగుతాయి. ఈ షీట్లను కరోనా సోకిన, సోకని వ్యక్తుల లాలాజలంతో కలిపి పరీక్షించారు. కరోనా సోకిన వ్యక్తి లాలాజలం తగిలినప్పుడు ఈ గ్రాఫీన్‌ షీట్లలో అటామిక్‌ లెవల్‌ వైబ్రేషన్స్‌ పెరుగుతున్నట్టు వీరి దృష్టికి వచ్చింది. వైబ్రేషన్స్‌లో చోటుచేసుకున్న మార్పులను కొలవడం కోసం పరిశోధకులు రామన్‌ స్పెకో్ట్రమీటర్‌ను ఉపయోగించారు. ఇలా గ్రాఫీన్‌ షీట్ల సహాయంతో కరోనా వైరస్‌ను కేవలం ఐదు నిమిషాల్లోనే కనిపెట్టవచ్చని పరిశోధకులు అంటున్నారు.


ఈ పరిశోధన వివరాలు అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కొవిడ్‌కు శాశ్వత అడ్డుకట్ట వేయాలంటే, కొవిడ్‌, ఇతరత్రా కొవిడ్‌ వేరియెంట్లను సత్వరం గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తాజా పరిశోధన కొవిడ్‌ అడ్డుకట్టకు తోడ్పడవచ్చు.


Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising