ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్లం.. పసుపుతో ఇమ్యూనిటీ డ్రింక్‌...

ABN, First Publish Date - 2021-05-29T05:30:00+05:30

రోగనిరోధకశక్తి... కరోనాతో దీనిపై అందరిలో అవగాహన పెరిగింది. అయితే ఇది విటమిన్‌ ట్యాబెట్ల ద్వారా కృత్రిమంగా తీసుకోకుండా... బలవర్థకమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోగనిరోధకశక్తి... కరోనాతో దీనిపై అందరిలో అవగాహన పెరిగింది. అయితే ఇది విటమిన్‌ ట్యాబెట్ల ద్వారా కృత్రిమంగా తీసుకోకుండా... బలవర్థకమైన ఆహారపు అలవాట్లతో సహజంగా పొందడమే మేలని వైద్యులు సూచిస్తున్నారు. రోగనిరోధకశక్తిని పెంచే అలాంటి పానీయమే ఇది. మీ రోజువారి మెనూలో వీటిని చేరిస్తే ఇమ్యూనిటీ బూస్టర్స్‌లా పనిచేస్తాయంటున్నారు న్యూట్రిషనిస్టులు. 


కావల్సినవి: కప్పు నీళ్లు, పావు కప్పు తురిమిన అల్లం, ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున యాపిల్‌సైడర్‌ వెనిగర్‌, తేనె. 


తయారీ: ఒక గిన్నె తీసుకొని, అందులో నీళ్లు, తురిమిన అల్లం, పసుపు వేసి ఐదు నుంచి పది నిమిషాలు వేడి చేయాలి. నీళ్లు మరగడం మొదలవ్వగానే స్టవ్‌ ఆపేసి, ఆ మిశ్రమాన్ని కాసేపు చల్లారనివ్వాలి. తరువాత కప్పులోకి వడగట్టి, దానికి యాపిల్‌సైడర్‌ వెనిగర్‌, తెనె కలిపి సేవించాలి. 


ప్రయోజనం: ఈ డ్రింక్‌లో ఉపయోగించిన పదార్థాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్‌ లక్షణాలు గలవి. యాపిల్‌సైడర్‌ వెనిగర్‌ శరీరంలోని వ్యాధికారకాలను నిర్మూలించి, బలమైన వ్యాధినిరోధకవ్యవస్థకు అవసరమైన ఆరోగ్యకరమైన గట్‌ బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. పసుపు, అల్లంలో యాంటీఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్‌ గుణాలు పుష్కలం. పసుపులో రోగాన్ని తగ్గించే సహజ గుణం ఉంటుంది. అల్లం తెల్లరక్త కణాలను వృద్ధి చేస్తుంది.

Updated Date - 2021-05-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising