ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల్లో ఏకాగ్రత కోసం!

ABN, First Publish Date - 2021-04-14T05:30:00+05:30

ఒక విషయం మీదనే ఎక్కువ సమయం దృష్టి పెట్టడం పెద్దలకే కాదు పిల్లలకూ కష్టమైన పనే. కొద్ది నిమిషాల్లోనే పిల్లల మనసు ఒక పని నుంచి మరొక పని మీదకు మరలడం తల్లిదండ్రులు చాలాసార్లు గమనించే ఉంటారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక విషయం మీదనే ఎక్కువ సమయం దృష్టి పెట్టడం పెద్దలకే కాదు పిల్లలకూ కష్టమైన పనే. కొద్ది నిమిషాల్లోనే పిల్లల మనసు ఒక పని నుంచి మరొక పని మీదకు మరలడం తల్లిదండ్రులు చాలాసార్లు గమనించే ఉంటారు. పిల్లల్లో ఉత్సాహం, ఆసక్తి ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. ఈ ధోరణి ప్రభావం కొత్త విషయాలు నేర్చుకొనే సామర్థ్యం మీద పడుతుంది. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు ఏం చేయాలంటే...


అంతరాయాలను తగ్గించాలి: పిల్లలకు అప్పగించిన పని వారు మనసు పెట్టి చేయాలంటే వారికి ఏ అంతరాయం కలగకుండా చూడాలి. ఏదైనా శబ్దం, టీవీ, సంగీతం, మొబైల్‌ఫోన్లు వంటివి ఎక్కువగా పిల్లల దృష్టిని మళ్లిస్తాయి. అందుచేత వారు చదువుకుంటున్నప్పుడు వీటన్నిటినీ వారికి దూరంగా ఉంచాలి. ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు ఒకే విషయం మీద మనసు లగ్నం చేస్తారు. అయితే అందరు పిల్లలకు ఇదే నియమం వర్తించదు.


ఫోకస్‌ గేమ్స్‌: పిల్లల్లో ఏకాగ్రత పెంచేందుకు తోడ్పడే రకరకాల ఆటవస్తువులు మార్కెట్లో చాలానే ఉన్నాయి. అయితే అవన్నీ ఒకే అంశం మీద దృష్టి పెట్టగల సామర్థ్యాన్ని పెంచేందుకు పనికొస్తాయి. వీటిలో క్రాస్‌వర్డ్‌, జిగ్‌సా పజిల్స్‌, కార్డ్‌ గేమ్స్‌ వంటివి పిల్లలతో ఆడించాలి. ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్స్‌ను మాత్రం పిల్లలకు ఎక్కువగా ఇవ్వొద్దు. ఎందుకంటే అవి వారి ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 


రొటీన్‌ వర్క్‌: ప్రతి రోజు పిల్లలతో ఒకే పని చేయించడం వల్ల వాళ్లు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు వారికి ఆ పని అలవాటుగా మారుతుంది. దాంతో ఒకే పనిని రోజూ చేస్తుండడం వల్ల వారిలో ధ్యాస పెరుగుతుంది. అయితే పిల్లలు తమంట తామే ఇష్టంతో ఆ పని చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. 


చిన్న లక్ష్యాలు: ఒకేసారి పెద్ద పని అప్పగిస్తే పిల్లలు భారంగా భావిస్తారు. అందుకే చిన్న చిన్న లక్ష్యాలు పెడితే వారు ఉత్సాహం చూపుతారు. అలాగే ఒకే పనిని ఎక్కువ రోజులు చేయడం వల్ల కొందరు పిల్లల్లో ఆసక్తి తగ్గుతుంది. అలాంటప్పుడు వారికి ఆటవిడుపు కోసం కొంత సమయం ఇవ్వాలి.

Updated Date - 2021-04-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising