ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిగారింపు తెచ్చే ఫేస్‌ప్యాక్స్‌!

ABN, First Publish Date - 2021-03-07T05:30:00+05:30

ఓవైపు పార్టీకి టైమ్‌ అవతుంటుంది. బ్యూటీపార్లర్‌కు వెళ్లే సమయం లేదు. అలాంటప్పడు ఈ సింపుల్‌ ఫేస్‌ప్యాక్స్‌తో నిగారింపు సొంతం చేసుకోవచ్చు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓవైపు పార్టీకి టైమ్‌ అవతుంటుంది. బ్యూటీపార్లర్‌కు వెళ్లే సమయం లేదు. అలాంటప్పడు ఈ సింపుల్‌ ఫేస్‌ప్యాక్స్‌తో నిగారింపు సొంతం చేసుకోవచ్చు. 


బాదం - పాలతో : ఐదు లేదా ఆరు బాదం గింజలను నీటిలో నానబెట్టాలి. తరువాత తొక్క తీసి వాటిని మెత్తటి పేస్టులా చేయాలి. ఆ పేస్టులో కొద్దిగా పాలు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో సున్నితంగా మర్దన చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది.


ఎగ్‌ వైట్‌ ఫేస్‌ప్యాక్‌ : గుడ్డు తెల్లసొనలో కొద్దిగా పాల మీగడ, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. గుడ్డు తెల్లసొనలోని ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చర్మంపై ముడతలను పోగొడతాయి. చర్మానికి కాంతినిస్తాయి. 


చందనం - రోజ్‌వాటర్‌తో.. :  గంధపుచెక్కను రోజ్‌వాటర్‌లో అరగదీసి దాన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం కాంతులీనుతుది. గంధం చెక్క అందుబాటులో లేకపోతే గంధంపొడిలో తగినంత రోజ్‌వాటర్‌ని కలిపి ముఖానికి ప్యాక్‌లా రాసుకోవచ్చు కూడా. 

Updated Date - 2021-03-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising