ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగ్‌ప్యాక్‌తో శిరోజాలు పదిలం!

ABN, First Publish Date - 2021-10-18T05:30:00+05:30

కోడిగుడ్డును హెయిర్‌ప్యాక్‌గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కోడిగుడ్డులో ప్రోటీన్‌, బయోటిన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇది దెబ్బతిన్న జుట్టును రిపేర్‌ చేయడమే కాకుండా సహజసిద్ధంగా ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోడిగుడ్డును హెయిర్‌ప్యాక్‌గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కోడిగుడ్డులో ప్రోటీన్‌, బయోటిన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇది దెబ్బతిన్న జుట్టును రిపేర్‌ చేయడమే కాకుండా సహజసిద్ధంగా మాయిశ్చరైజ్‌ చేస్తుంది. అంతేకాకుండా జుట్టు తెగిపోవడాన్ని ఆపుతుంది. జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది. ఈ ప్యాక్‌ను ఎలా తయారుచేసుకోవాలంటే...

పొడి జుట్టు కోసం...

కోడిగుడ్డు పచ్చసొనలు - రెండు, ఆలివ్‌ ఆయిల్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, నీళ్లు - ఒక కప్పు.

ఒక బౌల్‌లో కోడిగుడ్డు పచ్చసొనలు తీసుకుని అందులో ఆలివ్‌ ఆయిల్‌, నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని చేతి వేళ్లతో తలపై మర్దన చేస్తున్నట్టుగా రాయాలి. తల అంతటా సమంగా పట్టించాక షవర్‌ క్యాప్‌ని పెట్టుకోవాలి. అరగంట తరువాత షాంపూతో స్నానం చేయాలి. 

ఆయిలీ హెయిర్‌ అయితే...

ఎగ్‌వైట్స్‌ - రెండు, తేనె - ఒక టేబుల్‌స్పూన్‌, ఆలివ్‌ ఆయిల్‌ - ఒక టేబుల్‌స్పూన్‌.

ఒక బౌల్‌లో ఎగ్‌వైట్స్‌ తీసుకుని అందులో తేనె, ఆలివ్‌ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. షవర్‌క్యాప్‌ పెట్టి అరగంట పాటు వదిలేయాలి. తరువాత షాంపూతో శుభ్రంగా కడిగేసుకోవాలి.

Updated Date - 2021-10-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising