ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోపం వస్తుందా..? కంట్రోల్‌ చేసుకోండి..!

ABN, First Publish Date - 2021-05-08T05:30:00+05:30

పిల్లలన్నాక అల్లరి చేయడం, వద్దన్న పనులు చేయడం సహజం. దీంతో తల్లితండ్రులకు కోపం రావడం కూడా అంతే సహజం. కానీ వారిది తెలిసీ తెలియని వయసు. దాన్ని పెద్దలుగా మనం అర్థం చేసుకోవాలి. అది మరిచిపోయి కోపంలో పిల్లల్ని నోటికొచ్చినట్టు తిట్టేస్తే, తరువాత వారిపై ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలన్నాక అల్లరి చేయడం, వద్దన్న పనులు చేయడం సహజం. దీంతో తల్లితండ్రులకు కోపం రావడం కూడా అంతే సహజం. కానీ వారిది తెలిసీ తెలియని వయసు. దాన్ని పెద్దలుగా మనం అర్థం చేసుకోవాలి. అది మరిచిపోయి కోపంలో పిల్లల్ని నోటికొచ్చినట్టు తిట్టేస్తే, తరువాత వారిపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందనేది నిపుణుల మాట. పిల్లల ముందు ఎలాంటి మాటలు మాట్లాడకూడదో వారు సూచిస్తున్నారు... 


తల్లితండ్రులు పిల్లలతో ప్రవర్తించే తీరు, మాట్లాడే పద్ధతి వారి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనని, భావోద్వేగాలని ప్రభావితం చేస్తాయి. కోపంలో అనే మాటలు ఒక్కోసారి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. మానసికంగా దెబ్బతీస్తాయి. 

లావుగా ఉన్నావనో, సన్నగా అయిపోయావనో, రంగు లేవనో, చూడ్డానికి బాలేదనోలాంటివి పిల్లలతో అస్సలు అనకూడదు. ఇవి వారిలో అభద్రతా భావాన్ని పెంచుతాయి. అసలు అలాంటి ఆలోచనలే తల్లితండ్రుల్లో రాకూడదు. 

కొంతమంది తల్లితండ్రులు కోపంలో నువ్వు పుట్టకుండా ఉన్నా బావుండేదని, అబ్బాయిగా పుడితే బాగుండేదని అంటుంటారు. ఇలాంటి మాటలు వారిని ఆత్మన్యూనతలోకి నెట్టేస్తాయి. అనవసరంగా పుట్టాననే భావన వారిలో కలిగి, మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోతారు. 

చాలామంది పెద్దలు చేసే తప్పు... పిల్లల్ని వేరొకరితో పోల్చడం. ఒకరితో పోలుస్తున్నారంటే మీ పిల్లలకు మీరు విలువ ఇవ్వనట్టేనని గమనించండి. దీంతో ఏం చేసినా తమను మెచ్చుకోరన్న భావం ఏర్పడి, వారిలో ఈర్ష్య, అసూయలు పెరుగుతాయి. మీరే కాదు, మీ పిల్లలు కూడా వేరొకరితో పోల్చుకోకుండా చూడండి. 

మాట వినకపోతే పిల్లలపై కోపం రావడం సహజం. ఆ సమయంలో నువ్వు ఎందుకూ పనికిరావు, ఏ పనీ సరిగ్గా చేయవు లాంటి మాటలు మాట్లాడితే అవి పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తాయి. 

ఈ పని చేస్తే అది కొనిస్తా, అన్నం తింటే సర్‌ప్రైజ్‌ ఇస్తా, హోమ్‌వర్క్‌ చేస్తే షాపింగ్‌కు తీసుకెళతానని అప్పటికప్పుడు తల్లితండ్రులు ఏవేవో వాగ్దానాలు చేసేస్తుంటారు. కానీ ఆ తరువాతి క్షణమే వాటిని మరిచిపోతారు. దీనివల్ల కొంతకాలానికి వాళ్లు మిమ్మల్ని నమ్మడం మానేస్తారు. అలాకాకుండా మీరిచ్చిన వాగ్దానాల్లో గుర్తుపెట్టుకుని కొన్నయినా తీరిస్తే పిల్లల మనసులో చెరగని ముద్ర వేసుకొంటారు. వల్లకాని వాగ్దానాల జోలికి అస్సలు వెళ్లకండి. 

ఏదిఏమైనా పిల్లలకి సాధ్యమైనంత ప్రేమను పంచడం, వాళ్లు తమ జీవితంలో ఎంత ప్రత్యేకమో చెప్పే ప్రయత్నం చేయడం, స్నేహంగా మెలగడం, వీలైనంత సమయాన్ని వారితో గడపడం... ఇలాంటివన్నీ చిన్నారుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి. ఉన్నతమైన జీవన విధానానికి బాటలు వేస్తాయి. 

Updated Date - 2021-05-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising