ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా చేయండి!

ABN, First Publish Date - 2021-01-06T05:30:00+05:30

వండిన కూరలో ఉప్పు ఎక్కువైతే దాన్ని తగ్గించడానికి కొద్దిగా బియ్యప్పిండి కలపాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్కాలు

వండిన కూరలో ఉప్పు ఎక్కువైతే దాన్ని తగ్గించడానికి కొద్దిగా బియ్యప్పిండి కలపాలి.


 పులిసిన దోసె/ఇడ్లీ పిండిలో దాని పరిమాణానికి తగ్గట్టు నీళ్లు  పోసి ఒక అరగంటపాటు దాన్ని కదల్చకుండా ఉంచాలి. అప్పుడు ఆ పిండిపై నీరు తేరుతుంది. ఆ నీటిని పూర్తిగా వంచేస్తే ఆ దోసె లేదా  ఇడ్లీపిండి పులిసిన వాసన లేకుండా తాజాగా ఉంటుంది.


 వేడిపెనంపై అల్లాన్ని కాల్చితే దానిమీద ఉన్న పొట్టు సులభంగా వచ్చేస్తుంది.


 బాగా పులిసిన పెరుగులో  ఉప్పువేసి నల్లబడిన వెండి వస్తువులను అందులో మునిగేలా పెట్టి కొంతసేపైన తర్వాత పీచుతో వాటిని తోమితే అవి  తళ తళ మెరుస్తాయి.


ఇంట్లో ఊరగాయల కోసం తయారుచేసి ఉంచిన మెంతిపొడి మిగిలిపోతే దాన్ని పులిసిన పెరుగులో కలిపి తలకు మాస్కులా పెట్టుకోవచ్చు. ఇది వెంట్రుకలను పట్టుకుచ్చులా చేస్తుంది.


 రాజ్మా తినడం వల్ల కొందరు గ్యాసు సమస్యతో బాధపడుతుంటారు. అందుకే నానబెట్టిన రాజ్మా ఉడికించేటప్పుడు ఆ నీళ్లల్లో కొద్దిగా శొంఠిపొడి, ఇంగువ వేస్తే గ్యాస్‌ సమస్య తలెత్తదు.


 వేడెక్కిన పెనం మీద ఇంగువపొడి వేసి ఆ పొగ ఊరగాయపెట్టే చిన్న జాడీకి పట్టేలా చేయాలి. తర్వాత ఆ జాడీలో కాస్త నువ్వుల నూనె వేసి  జాడీ పక్కలకు, అడుగున  నూనె అంటుకునేలా చేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత అందులో ఊరగాయ పెట్టుకుంటే  తొందరగా వాసన రాదు. 

Updated Date - 2021-01-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising