ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహార సూత్రాలు

ABN, First Publish Date - 2021-07-27T05:30:00+05:30

పేర్లు తెలియని పదార్థాలతో తయారవుతున్న ఆహారాలు మార్కెట్లో బోలెడు. కాబట్టి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పేర్లు తెలియని పదార్థాలతో తయారవుతున్న ఆహారాలు మార్కెట్లో బోలెడు. కాబట్టి తినే ముందు దాన్లో ఏం కలిపారు? ఎలా తయారైంది? ఎన్ని పదార్థాలతో తయారైంది? అనే వివరాలు తెలుసుకోవాలి. ఐదు అంతకంటే ఎక్కువ రకాల పదార్థాలు కలిపి తయారుచేసిన ఆహారాలకు దూరంగా ఉండడమే మేలు. ఇలాంటి వాటికి శరీరం స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. కొత్త పదార్థాలను శరీరం తేలికగా స్వీకరించలేదు. కాబట్టి తినే సమయంలో ఒకేసారి ఎక్కువ పరిమాణంలో కాకుండా, స్వల్ప పరిమాణాల్లో శరీరానికి అలవాటు చేయాలి. లేదంటే వాంతులు, విరేచనాలు లాంటి అసౌకర్యాలు తప్పవు. 


 ఎంత ఆకలిగా ఉన్నా పొట్ట నిండుగా తినకూడదు. పొట్టలో ఎంతో కొంత ఖాళీ జాగా వదిలినప్పుడే ఆహారం తేలికగా జీర్ణమవుతుందనే విషయం గుర్తు పెట్టుకుని మెలగాలి.


 టి.వి చూస్తూ భోజనం చేసే అలవాటు ఉంటే మానుకోండి. తినే ఆహారం మీద నుంచి మనసు మళ్లితే ఎంత తింటున్నాం అనే దాని మీద దృష్టి ఉండదు. కాబట్టి భోజనాల గదిలో టి.వి లేకుండా చూసుకోండి. 


 ఆకలి వేస్తేనే తినాలి. కానీ భోజనం వేళ అయిందనో, తినాలి కాబట్టి తినడమో చేయకూడదు. కొన్నిసార్లు భోజన సమయానికి ఆకలి వేయదు. తినాలనిపించేంత ఆకలి కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు భోజనాన్ని వాయిదా వేయండి. పోషకాల అవసరాన్నిబట్టి శరీరమే ఆకలిని కలిగిస్తుంది. అప్పటివరకూ ఆగడం  మంచిదే!


Updated Date - 2021-07-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising