ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిద్రతో చర్మసోయగం!

ABN, First Publish Date - 2021-01-13T05:45:17+05:30

చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండేందుకు సౌందర్య ఉత్పత్తులు ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. చక్కగా వేళకు నిద్రపోతే చాలు అంటున్నారు చర్మనిపుణురాలు గీతికా మిట్టల్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండేందుకు సౌందర్య ఉత్పత్తులు ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. చక్కగా వేళకు నిద్రపోతే చాలు అంటున్నారు చర్మనిపుణురాలు గీతికా మిట్టల్‌. చర్మంపై నిద్ర ప్రభావం గురించి ఆమె ఈమధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న విషయాలేమిటంటే...


 నిద్ర అనేది శరీరం, శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మన శరీరంలో అతి పెద్ద అవయవం అయిన చర్మం ఆరోగ్యం, తాజాదనం, నిగారింపు మీద నిద్ర ప్రభావం చూపుతుంది. 


 కంటి నిండా నిద్రపోవడం వల్ల చర్మం తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అవుతాయి. దాంతో ఫ్రీరాడికల్స్‌ తొలగిపోతాయి. నల్లమచ్చలు, ముడతలు మాయమవుతాయి.


 చక్కని కునుకు తీస్తే మూత్రపిండాల్లో సోడియం, నీటి మోతాదు ఒకేస్థాయిలో ఉంటుంది. దీని ఫలితంగా శరీరం తొందరగా నీటిని కోల్పోదు. చర్మం తాజాగా, ఆరోగ్యంగా మారుతుంది.


 రక్తసరఫరా చక్కగా జరిగితే చర్మ కణాలన్నిటికి పోషణ అందుతుంది. ఈ చర్యతో చర్మం రంగు అంతటా ఒకేలా ఉంటుంది. 


Updated Date - 2021-01-13T05:45:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising