ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరుల సాగు

ABN, First Publish Date - 2021-07-08T06:34:55+05:30

ఈశాన్యరాష్ట్రమైన మేఘాలయలో ఒక నిశబ్ద విప్లవానికి నాంది పలికింది ట్రినిటీ సైయో. గతంలో స్కూల్‌ టీచర్‌గా పనిచేసిన ట్రినిటీ, వ్యవసాయం మీద మక్కువతో పసుపు సాగువైపు మళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఔషధ విలువలు పుష్కలంగా ఉండే లకాడోంగ్‌ పసుపు సాగుతో సిరుల పంట పండిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. సేంద్రియ వ్యవసాయంపై ఎంతోమంది గ్రామీణ మహిళలకు శిక్షణనిస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు సహాయపడుతోంది. మహిళల కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా పద్శశ్రీ అవార్డుతో భారతప్రభుత్వం సత్కరించింది. మేఘాలయలోని ములీహ్‌ గ్రామానికి చెందిన 53 ఏళ్ల ట్రినిటీ సైయో విశేషాలు ఇవి...


ఈశాన్యరాష్ట్రమైన మేఘాలయలో ఒక నిశబ్ద విప్లవానికి నాంది పలికింది ట్రినిటీ సైయో. గతంలో స్కూల్‌ టీచర్‌గా పనిచేసిన ట్రినిటీ, వ్యవసాయం మీద మక్కువతో పసుపు సాగువైపు మళ్లింది. ప్రస్తుతం సేంద్రియ పద్ధతుల్లో పసుపు సాగు చేస్తూ సిరుల పంట పండిస్తోంది. అదే సమయంలో గ్రామీణ మహిళలకు పసుపు సాగులో శిక్షణనిస్తూ వాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు సహాయపడుతోంది. వ్యవసాయంలోకి అడుగుపెట్టాక ట్రినిటీ స్వయంసహాయక సంఘాలను(సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్స్‌) ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ గ్రూపులకు చెందిన వంద మంది మహిళలు పసుపు సాగు చేస్తున్నారు. అంతేకాదు ట్రినిటీ ‘‘హిల్స్‌ కుర్‌క్యుమిన్‌ అండ్‌ స్పైస్‌ ప్రొడ్యూసర్‌ సొసైటీ’’ పేరుతో ఒక అసోసియేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్వయం సహాయక సంఘాలు పండిస్తున్న పసుపులో 30 మెట్రిక్‌ టన్నులు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ట్రినిటీ సాగు చేసే పసుపులో లకాడోంగ్‌ అనే రకం మేలైనది. ఈ రకానికి బాగా డిమాండ్‌ ఉంది. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ట్రినిటీ సేవలను గుర్తించిన ప్రభుత్వం 2020లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 


టీచర్‌ నుంచి రైతుగా....

ట్రినిటీ రైతు కుటుంబం నుంచి వచ్చిన మహిళే. అయితే టీచర్‌ వృత్తిని వదిలి పసుపు సాగువైపు మళ్లడం మాత్రం అనుకోకుండా జరిగింది. 2003లో ములీహ్‌ గ్రామాన్ని స్పైసెస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా సందర్శించింది. వాళ్లు లకాడోండ్‌ పసుపులో ఉన్న ఔషధ గుణాలు, మార్కెట్లో దానికున్న డిమాండ్‌ను ప్రజలకు వివరించారు. వారి మాటలు ట్రినిటీలో కొత్త ఆలోచనను చిగురింప చేశాయి. ‘‘లకాడోంగ్‌ పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి, దాని సాగు గురించి నాకు కొంత తెలుసు. పసుపు సాగు పట్ల నేను ఆసక్తి కనబరచడంతో బోర్డు అధికారులు నా పేరు నమోదు చేసుకున్నారు. నాతోపాటు మా గ్రామంలో ఏడుగురి పేర్లను చేర్చారు.’’ అని ఆనాటి ప్రయాణాన్ని పంచుకుంటారు ట్రినిటీ. టీచర్‌గా పనిచేసిన ట్రినిటీ ఇంగ్లీషు, హిందీ భాషలు మాట్లాడగలదు. అది ఆమెకు కలిసొచ్చింది. సబ్సిడీ స్కీంలపై బోర్డు అధికారులతో చర్చించేందుకు వీలు పడింది. ఇక ఆ తరువాత ట్రినిటీ వెనుదిరిగి చూసుకోలేదు. చుట్టు పక్కల గ్రామాల్లోని మహిళలకు పసుపుసాగుపై అవగాహన కల్పించింది. సుమారు 800 మంది మహిళలకు శిక్షణనిచ్చింది. వాళ్లంతా పసుపు సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకొన్నారు. 


సొసైటీ ఆధ్వర్యంలో...

ట్రినిటీ ఏర్పాటు చేసిన సొసైటీలో 25 మంది కోర్‌ సభ్యులు ఉన్నారు. ఈ సొసైటీ ఆధ్వర్యంలో మిషన్‌ లకాడోంగ్‌ పేరుతో పసుపు సాగును మరింత విస్తృతం చేస్తే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘సొసైటీ ఏర్పాటు చేశాక పసుపు ఉత్పత్తి, వెలికితీతకు అవసరమైన యంత్రాలను సమకూర్చుకున్నాం. అంతేకాకుండా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నాం’’ అని అంటారు ట్రినిటీ. బోర్డు సహాయంతో ఆమె మేలురకాలైన విత్తనాలను సేకరించడం, తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవడానికి అనుసరించాల్సిన విధానాల గురించి రైతులకు వివరిస్తున్నారు. ‘‘స్థానిక రైతుల నుంచి పసుపును సేకరిస్తున్నాం. లాస్కిన్‌ బ్లాక్‌లో ఉన్న సుమారు 86 గ్రామాలలోని రైతుల నుంచి పసుపు సేకరించడానికి నుంచి మనుషులను ఏర్పాటు చేశాం. చిన్న గ్రైండింగ్‌ మెషిన్లు ఏర్పాటు చేసుకున్నాం’’ అని తన సాగు తీరును వివరిస్తారు ట్రినిటీ.

Updated Date - 2021-07-08T06:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising