ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలు అభద్రతకు లోనవుతుంటే...

ABN, First Publish Date - 2021-10-28T05:30:00+05:30

అభద్రతా భావం, ఆత్మవిశ్వాసం లోపించడం వంటివి ఎవరికీ పుట్టుకతో రావు. తిరస్కరణకు గురికావడం, విమర్శలు, గాయపరిచే మాటలు... ఇలాంటి అంశాలన్నీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభద్రతా భావం, ఆత్మవిశ్వాసం లోపించడం వంటివి ఎవరికీ పుట్టుకతో రావు. తిరస్కరణకు గురికావడం, విమర్శలు, గాయపరిచే మాటలు... ఇలాంటి అంశాలన్నీ పిల్లలను అభద్రతా భావాన్ని పెంచుతాయి. కాబట్టి పిల్లలు అభద్రతకు లోనవుతున్నట్టు అనిపిస్తే వెంటనే వారికి తోడుగా నిలవాలి. వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు సహాయపడాలి.


  • పిల్లలు అభద్రతకు లోనయినప్పుడు మాట్లాడటానికి ఇష్టపడరు. కఠినంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు వాళ్లతో మాట్లాడటానికి సమయం కేటాయించాలి. ఎక్కువ సమయం వాళ్లతో గడపాలి. ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించాలి. 
  • అభద్రతకు కారణమేంటో కనుక్కునే ప్రయత్నం చేయాలి. పిల్లలతో ఎక్కువ సమయం మాట్లాడినప్పుడే కారణాన్ని కనుక్కోవడం సాధ్యమవుతుంది. తరువాత వారికి సహాయం చేయాలి. అలాంటి సమస్యలు ఎదురయినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో వాళ్లకు నేర్పించాలి. 
  • పిల్లలు తప్పులు చేయడం సహజం. పిల్లలు తప్పులు చేస్తున్నప్పుడు వాళ్లను గైడ్‌ చేయాలి. ప్రతి తప్పు నుంచి ఏం నేర్చుకున్నావని అడగాలి. పిల్లలు గిల్టీగా ఫీల్‌ అయ్యేలా మాట్లాడకూడదు. నెగెటివ్‌ కామెంట్స్‌ మంచివి కావు. 
  • ఇతరులు చేసే విమర్శలను ఎలా స్వీకరించాలో తెలియజెప్పాలి. వేటిని పట్టించుకోవాలి, వేటిని పట్టించుకోవద్దో విడమరిచి చెప్పాలి. నెగెటివ్‌ కామెంట్స్‌ చేసే వ్యక్తుల పట్ల ఎలా మసలుకోవాలో నేర్పాలి.
  • ఇటీవల పిల్లలు సోషల్‌మీడియాకు ఎక్కువగా అట్రాక్ట్‌ అవుతున్నారు. పిల్లల్లో ఇన్‌సెక్యూరిటీకి సోషల్‌ మీడియా కూడా కారణం. విమర్శలు, ట్రోల్స్‌ వంటివి ప్రభావం చూపుతుంటతాయి. కాబట్టి వాళ్ల సోషల్‌మీడియా యాక్టివిటీలపై ఒక కన్నేసి ఉంచాలి.
  • ఇంట్లో పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడాలి. ఇల్లు సురక్షితమైన ప్రదేశంగా పిల్లలు భావించాలి. మీపై ఉన్న ఆఫీసు ఒత్తిడిని పిల్లలపై రుద్దకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లల్లో ఇన్‌సెక్యూర్‌ ఫీలింగ్‌ను దూరం చేయవచ్చు.

Updated Date - 2021-10-28T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising