ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొడవలకు బైబై...

ABN, First Publish Date - 2021-03-03T06:02:32+05:30

మనసు పడడం, మనసు పడిన వ్యక్తితో జంటగా సాగడం మొదట్లో చాలా థ్రిల్‌గా, సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి చిన్న విషయాల్లో విభేదించడం వల్ల ఇద్దరి మధ్య మాటకు మాట పెరుగుతుంది. భావోద్వేగంలో ఇద్దరూ గట్టిగా అరుచుకుంటారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనసు పడడం, మనసు పడిన వ్యక్తితో జంటగా సాగడం మొదట్లో చాలా థ్రిల్‌గా, సంతోషంగా అనిపిస్తుంది. కానీ  ఒక్కోసారి చిన్న విషయాల్లో విభేదించడం వల్ల ఇద్దరి మధ్య మాటకు మాట పెరుగుతుంది. భావోద్వేగంలో ఇద్దరూ గట్టిగా అరుచుకుంటారు. చిన్న విషయాలు కాస్త పెద్దవై కూర్చుంటాయి. అయితే వీటన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్లాలి. అప్పుడే మీ అనుబంధం ఆనందాల పల్లవి అవుతుంది. అందుకు ఏం చేయాలంటే...

  • చాలా సందర్భాల్లో ఏకాభిప్రాయం కుదరకనే గొడవలు వస్తుంటాయి. అయితే ఏదైనా విషయంలో ఇద్దరి మధ్య మనస్ఫర్థలు, గొడవ వచ్చినప్పుడు ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అన్న ధోరణి అనుసరించొద్దు. ఎవరో ఒకరు తమ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పాలి. దాంతో గొడవ పెద్దది కాకుండా చూడొచ్చు.
  • ‘అసలు నేను ఎందుకు అప్‌సెట్‌గా ఉంటున్నాను’అని ముందుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీ భాగస్వామి తీరు ఎందుకు నచ్చడం లేదో ఆలోచించుకోవాలి. అడగాలనుకున్న విషయాన్ని మనసులో పెట్టుకొని బాధపడకుండా వెంటనే మీ ప్రియతమను అడిగేయాలి. అప్పుడు మీకు సమాధానం దొరకుతుంది. ఇద్దరికీ తప్పులను సరిదిద్దుకొనే అవకాశం దొరకుతుంది. 
  • ఇద్దరిలో ఎవరో ఒకరు సారీ చెప్పి, మునుపటిలా సంతోషంగా ఉండేందుకు బాటలు వేయాలి. మీ బంధానికి మీరు ఎంత విలువ ఇస్తున్నారన్నది అవతలి వ్యక్తికి అప్పుడే అర్థమవుతుంది. చిన్న చిన్న తగవులు మీ మధ్య దూరాన్ని పెంచకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపై ఉందని గ్రహించాలి.
  • ఇగోకు పోవడం మీ అనుబంధానికి చేటు చేస్తుంది. ఒక్కసారి మీకు నచ్చని విధంగా ప్రవర్తించారని లేదా మీతో విబేధిస్తున్నారని అవతలి వారిని తప్పు పట్టడం సరికాదు. వారి ఇష్టాలు, అభిప్రాయాలను గౌరవించడం అంటే వారికి గౌరవం ఇవ్వడమనే సంగతి మరచిపోవద్దు.
  • మీ జంట ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను ఇద్దరూ ఒక్కటిగా దాటాలి. అందుకు కావాల్సిందల్లా పరస్పర అవగాహన, గౌరవం. ఈ రెండూ మీ మధ్య వచ్చే చిన్న చిన్న పొరపొచ్చాలను దూది పింజల్లా తేలిపోయేలా చేస్తాయి. 
  • ప్రేమగా ఒక ముద్దు, నువ్వంటే చెప్పలేనంత ఇష్టమని చాటేలా గట్టిగా ఒక కౌగిలింత.... ఇవి చేసే మ్యాజిక్‌ చాలానే. లేట్‌ నైట్‌ డిన్నర్‌కి వెళ్లి ఇద్దరికి ఇష్టమైన ఫుడ్‌ తింటూ మీ జతతో ఊసులాడడం గొప్ప ఫీల్‌నే కాదు మీ బంధాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తాయి.

Updated Date - 2021-03-03T06:02:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising