ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెస్ట్‌ డైట్‌ ప్లాన్‌

ABN, First Publish Date - 2021-11-23T09:13:19+05:30

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌, కీటో డైట్‌, వీగన్‌ డైట్‌... ఎవర్ని కదిలించినా ఏదో ఒక డైట్‌ పేరు వినిపిస్తూ ఉంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌, కీటో డైట్‌, వీగన్‌ డైట్‌... ఎవర్ని కదిలించినా ఏదో ఒక డైట్‌ పేరు వినిపిస్తూ ఉంది. అయితే ఆ డైట్లతో బరువుతో పాటు ఓపికనూ కోల్పోతుంటే అక్కడితో ఆగి అనుసరిస్తున్న డైట్‌ను ఇంకోసారి విశ్లేషించాలి.


ఒక ఆహార సముదాయానికి చెందిన పదార్థాలనే కలిగి ఉంటూ, మిగతా వాటిని దూరం పెట్టేసే డైట్‌ మీదైతే దాంతో మీకు ఒరిగేది తాత్కాలిక వెయిట్‌ లాసే! ఇలాంటి డైట్‌ అనారోగ్యకరం కూడా! తినే ఆహారాన్ని క్యాలరీలు, ప్రొటీన్లు, కొవ్వుల రూపంలో లెక్కించుకుంటూ విలువైన పోషకాలను తగ్గించేసుకోవడం సరి కాదు. అలాగే నెలలో ఒకరోజు ఉపవాసం ఉంటూ, తర్వాత తరచుగా భోజనం మానేయడం, హఠాత్తుగా ఒక రకం ఆహార పదార్థాన్ని ఎక్కువగా తినేయడం చేస్తుంటే, మీరు సరైన డైట్‌ అనుసరించడం లేదని అర్థం. వంటింట్లో వండే పదార్థాలను, తినే ఆహారాన్ని తూచి తినడం కూడా సరైన పద్ధతి కాదు. అనుసరించే డైట్‌ ప్లాన్‌లో కామన్‌ సెన్స్‌, క్విజీన్‌, కల్చర్‌, క్లైమెట్‌... ఈ నాలుగు ‘సి’లు ఉండేలా చూసుకోవాలి. తింటున్నది ఎందుకు తింటున్నామనే కామన్‌సెన్స్‌ కలిగి ఉండడంతో పాటు క్విజీన్‌ ప్రాంతీయమైనదై ఉండేలా చూసుకోవాలి. అలాగే సంప్రదాయ వంటకాలకే పెద్ద పీట వేయాలి. వాతావరణాన్ని బట్టి కాలానుగుణంగా పండే కూరగాయలు, పండ్లు తినాలి. ఇలా కాకుండా ఎక్కడో చదివినవీ, ఎవరినో చూసి స్ఫూర్తి పొందినవీ అయిన డైట్‌ ప్లాన్లను అనుసరించి, ఆహార శైలిలో బోలెడన్ని మార్పులు చేసుకోవడం ద్వారా పొందే తక్షణ ఫలితాలు ఆరోగ్యకరం కానే కాదు.

Updated Date - 2021-11-23T09:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising