ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లిప్‌స్టిక్‌ వాడే ముందు..!

ABN, First Publish Date - 2021-03-17T05:57:00+05:30

సరైన లిప్‌స్టిక్‌ ఎంచుకున్నప్పుడే అందం రెట్టింపు అవుతుంది. కానీ ఎవరికి ఎలాంటి లిప్‌స్టిక్‌ నప్పుతుందో తెలుసుకోవాలి. అందుకు ఏం చేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరైన లిప్‌స్టిక్‌ ఎంచుకున్నప్పుడే  అందం రెట్టింపు అవుతుంది. కానీ ఎవరికి ఎలాంటి లిప్‌స్టిక్‌ నప్పుతుందో  తెలుసుకోవాలి. అందుకు ఏం చేయాలంటే...


చర్మం రంగుకు తగ్గట్టు లిప్‌స్టిక్‌ను ఎంచుకోవాలి. చర్మం తెల్లగా ఉంటే ఆరంజ్‌, బ్రౌన్‌ లిప్‌స్టిక్స్‌ బాగుంటాయి. చర్మం చామనఛాయ రంగులో ఉండేవాళ్లు లైట్‌ బ్రౌన్‌ కలర్‌ లిప్‌స్టిక్‌  వాడాలి. లైట్‌ జెర్రీరంగు లిప్‌స్టిక్‌ కూడా వీళ్లకు బాగా నప్పుతుంది.

తెల్లటి మేని ఛాయ ఉన్నవారు   ఎలాంటి లిప్‌స్టిక్‌ షేడ్స్‌ వేసుకున్నా బాగుంటారు. అయితే పింక్‌ కలర్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే వీళ్ల అందం రెట్టింపు అవుతుంది.

స్కిన్‌ డార్క్‌ కలర్‌లో ఉంటే ఎలాంటి పింక్‌ షేడ్‌  ఉన్న లిప్‌స్టిక్‌  వేసుకున్నా బాగుంటారు. ముఖ్యంగా డార్క్‌ పింక్‌ లిప్‌స్టిక్‌ వీళ్లకు బాగా నప్పుతుంది. అయితే లేత గులాబిరంగు షేడ్స్‌ ఉన్న లిప్‌స్టిక్‌ వీళ్లకు నప్పదు.

లిప్‌స్టిక్‌ని పగటిపూట లైట్‌గా, రాత్రి పూట దట్టంగా వేసుకోవాలి. వేడి, చల్లదనాలకు పెదవులు పొడిబారకుండా ముందుగా కొబ్బరి నూనె రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన కాటన్‌తో పెదవులను  శుభ్రం చేసుకుని లిప్‌స్టిక్‌ రాసుకుంటే పెదాలు ఎంతో అందంగా కనిపిస్తాయి.

లిప్‌స్టిక్‌ కొని ఆరు నెలలు దాటితే దానిని వాడకూడదని గుర్తుంచుకోండి.

ఒకసారి లిప్‌స్టిక్‌ వేసుకున్నాక పెదాలతో దాన్ని సరిచేయొద్దు.

ముందుగా లిప్‌ పెన్సిల్‌తో పెదవులపై అవుట్‌లైన్‌ వేసుకుని ఆ తర్వాత లిప్‌స్టిక్‌ రాసుకోవాలి.

లిప్‌స్టిక్‌ వేసుకునే ముందు వాజ్‌లైన్‌ రాసుకున్నా పెదవులు ఎంతో ఆకర్షణీయంగా, మృదువుగా కనిపిస్తాయి.

Updated Date - 2021-03-17T05:57:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising