ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయలు కొనే ముందు...

ABN, First Publish Date - 2021-03-24T07:37:14+05:30

కూరగాయలు లేతగా ఉండాలి. పుచ్చులు ఉండకూడదు అని చూసి మరీ కొంటాం. అయినా కూడా చాలాసార్లు ముదిరిపోయిన, పాడైపోయిన కూరగాయలే ఇంటికి తెచ్చుకుంటాం.. మరి తాజాగా ఉన్నవాటిని గుర్తించడం ఎలా అంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూరగాయలు లేతగా ఉండాలి. పుచ్చులు ఉండకూడదు అని చూసి మరీ కొంటాం. అయినా కూడా చాలాసార్లు ముదిరిపోయిన, పాడైపోయిన కూరగాయలే ఇంటికి తెచ్చుకుంటాం.. మరి తాజాగా ఉన్నవాటిని గుర్తించడం ఎలా అంటే...


వంకాయలు ముడతలు పడి ఉండకూడదు. మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉన్న వాటిని కొనొద్దు. వంకాయ తొడిమ ఆకుపచ్చ రంగులో ఉండాలి. వంకాయలు నిగ నిగలాడుతుండాలి.

బంగాళాదుంపలు గట్టిగా ఉండాలి. దుంపలపై నల్లని లేదా ఆకుపచ్చని మచ్చలు ఉండకూడదు.

ఉల్లిపాయ పైపొరలో తేమ ఉంటే వాటిని కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే అవి తొందరగా పాడవుతాయి.

క్యారెట్లు లేతగా, తాజాగా, మంచి ఆకారంలో ఉంటేనే కొనాలి. మెత్తగా ఉన్న క్యారెట్లను కొనొద్దు. క్యారెట్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే మెత్తగా అయిపోతాయి. 

ఆకుపచ్చ ఆకులు ఉన్న క్యాలిఫ్లవర్‌ని మాత్రమే తీసుకోవాలి. 

ఆకుకూరలు కొనేటప్పుడు వాటిపై తెల్లమచ్చలు లేకుండా చూసుకోవాలి. అలాగే వాటి కాడలు లేతగా, తాజాగా ఉన్నాయో లేదో గమనించాలి. 

వేళ్లు ఉన్న ట్‌రూట్‌నే కొనాలి. వాటిపై ఎలాంటి రంధ్రాలు, మచ్చలు ఉండకూడదు.

Updated Date - 2021-03-24T07:37:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising