ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాక్‌డోర్‌ ఎంట్రీ చైనా నుంచి మరో యాప్‌!

ABN, First Publish Date - 2021-07-17T06:19:13+05:30

చైనా యాప్‌లను గత ఏడాది నిషేధించినప్పటికీ పరోక్షంగా అవి మన దేశంలో ప్రత్యక్షమవుతున్నాయి. ‘పబ్జీ’ ఇప్పటికే ‘బ్యాటిల్‌గ్రౌండ్స్‌’ మొబైల్‌ ఇండియా పేరుతో వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైనా యాప్‌లను గత ఏడాది నిషేధించినప్పటికీ పరోక్షంగా అవి మన దేశంలో ప్రత్యక్షమవుతున్నాయి. ‘పబ్జీ’ ఇప్పటికే ‘బ్యాటిల్‌గ్రౌండ్స్‌’ మొబైల్‌ ఇండియా పేరుతో వచ్చింది. తాజాగా షాపింగ్‌ యాప్‌ ‘షీన్‌’ అమెజాన్‌ తోడుగా మన దేశంలో అడుగుపెడుతోంది. ఈ క్లాతింగ్‌, యాక్సెసరీ యాప్‌ పరోక్ష పద్ధతిలో సాక్షాత్కరించనుంది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ను ఈ నెల 26న అర్ధరాత్రి దాటిన తరవాత నిర్వహించనున్నారు. ‘షీన్‌’ అందులో భాగం అవుతుందని సమాచారం. అయితే అధికారిక ప్రకటన ఏదీ అమెజాన్‌ యాప్స్‌లో కనిపించడం లేదు. ట్విట్టర్‌లో మాత్రం సంబంఽధిత స్ర్కీన్‌షాట్స్‌ కనిపిస్తున్నాయి. డే సేల్‌ నుంచి రెగ్యులర్‌ ఈ కామర్స్‌ బిజినెస్‌గా కొనసాగే అవకాశం ఉంది. నిజానికి ‘షీన్‌’ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఇండియాలో లభ్యం కాకుండా ఎన్నడో తొలగించారు. అధికారికంగా సమాచారం ఏమీ లభ్యంకానప్పటికీ ‘షీన్‌’ ఏ రకంగా మనదేశంలోకి వస్తుందో చూడాల్సి ఉంది.

Updated Date - 2021-07-17T06:19:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising