ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృత్రిమ చక్కెర చేటు!

ABN, First Publish Date - 2021-07-27T05:30:00+05:30

చక్కెరతో ఒంట్లోకి క్యాలరీలు చేరిపోతాయి కాబట్టి ఎక్కువ శాతం మంది ఆర్టిఫిషియల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్కెరతో ఒంట్లోకి క్యాలరీలు చేరిపోతాయి కాబట్టి ఎక్కువ శాతం మంది ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్లను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఇవి ఎంతవరకూ సురక్షితం? ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్ల వల్ల దీర్ఘకాలంలో బరువు పెరగటం, ఒబేసిటీ బారిన పడే ప్రమాదాలు ఉంటాయి.


తక్కువ క్యాలరీలను కలిగి ఉండి, తీపి రుచిని అందించేవి ‘కృత్రిమ స్వీటెనర్లు’. కానీ ఇవి నెగటివ్‌ మెటబాలిజానికి దారితీయటంతోపాటు, పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా, ఆకలి మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ‘ఆస్పర్టేమ్‌, సుక్రలోజ్‌, స్టేవియా వాడే వారిలో రక్తపోటు పెరగటం, హృద్రోగాలు తలెత్తటం లాంటివి కనిపిస్తున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. బరువు పెరగకుండా ఉండటం కోసం వీటి మీద ఆధారపడే  వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరగిపోతోంది.


నిజానికి బరువు పెరగకుండా నియంత్రిస్తాయనుకునే ఈ ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్లు అందుకు వ్యతిరేకంగా పనిచేసి ఊబకాయాన్ని సంతరించి పెడతాయి. కృత్రిమ స్వీటెనర్ల వాడకం వల్ల బరువు నియంత్రణలో ఉన్నట్లు ఎక్కడా దాఖలాలు కూడా లేవు. పైగా ఆర్టిఫిసియల్‌ స్వీటెనర్లకు మధుమేహం, రక్తపోటు, ఒబేసిటీ, హృద్రోగాలకు దగ్గర సంబంధం ఉన్నట్టు కూడా పరిశోధనల్లో తేలింది. కాబట్టి వీటికి స్వస్థి చెప్పి సాధ్యమైనంత వరకూ తక్కువ పరిమాణాల్లోనే సాధారణ చక్కెరలను వాడటం మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.


Updated Date - 2021-07-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising