ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళన ఆమడ దూరం

ABN, First Publish Date - 2021-10-19T05:30:00+05:30

ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో కొంత ఆందోళన, ఆదుర్దా సహజం. అయితే అవి రక్తపోటును పెంచేటంత స్థాయికి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో కొంత ఆందోళన, ఆదుర్దా సహజం. అయితే అవి రక్తపోటును పెంచేటంత స్థాయికి చేరుకోకుండా జాగ్రత్త పడాలి. ధ్యానం, యోగా, వ్యాయామాలతో పాటు యాంటీ యాంగ్జయిటీ ఆహారంతో కూడా ఆందోళనను అదుపులో ఉంచుకోగలిగే వీలుంది.


బ్రౌన్‌ రైస్‌: మాంగనీసు, సెలీనియం, మెగ్నీషియం, బి విటమిన్లు... ఇలా నాడీ వ్యవస్థకూ, మానసిక ఆరోగ్యానికీ కీలకమైన పోషకాలు బ్రౌన్‌ రైస్‌లో ఉంటాయి. కాబట్టి తెల్ల అన్నం మానేసి, బ్రౌన్‌ రైస్‌ అలవాటు చేసుకోవాలి.

ఆకుపచ్చ అరటి: నాడుల్లో సంకేతాల ప్రసారానికి, కండరాల పనితీరుకు, కణాల్లో ద్రవ పరిమాణానికీ తోడ్పడే ఖనిజలవణం  పొటాషియం ఆకుపచ్చని అరటిలో ఎక్కువ. అలాగే ఈ అరటితో ఆందోళన అదుపు తప్పేలా చేసే రక్తంలోని చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరిగిపోకుండా ఉంటాయి.

బాదం: బాదంలో మెదడుకు మేలు చేసే విటమిన్‌ ఇ, మెగ్నీషియం ఉంటాయి. విటమిన్‌ ఇ ఫ్రీ ర్యాడికల్‌ డ్యామేజీ నుంచి కణాల పైపొరలకు రక్షణనిస్తుంది. ఫలితంగా మెదడు ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. పెరిగే వయసుతో జ్ఞాపకశక్తి తరిగిపోకుండా ఉంటుంది.

అవిసె గింజలు: వీటిలో మెదడు ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, బి విటమిన్‌, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, మాంగనీసు, ఐరన్‌, జింక్‌ మొదలైన భావోద్వేగాలను మెరుగ్గా ఉంచే పోషకాలు కూడా ఉంటాయి. రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని పాలలో లేదా నీళ్లలో ఒక స్పూను అవిసె గింజల పొడి కలుపుకుని తాగుతూ ఉండాలి.

Updated Date - 2021-10-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising