ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలర్జీ ఉంటే?

ABN, First Publish Date - 2021-01-26T06:35:27+05:30

మనలో సుమారు 30% మందికి ఏదో ఒక అలర్జీ ఉంటుంది. ఈ కోవకు చెందిన వాళ్లు కొవిడ్‌ టీకా తీసుకునే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కనీసం గంట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనలో సుమారు 30% మందికి ఏదో ఒక అలర్జీ ఉంటుంది. ఈ కోవకు చెందిన వాళ్లు కొవిడ్‌ టీకా తీసుకునే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కనీసం గంట పాటైనా వైద్యుల పర్యవేక్షణలో ఉండడం అవసరం. అంతేకాకుండా వ్యాక్సిన్‌ సమయంలో కొన్ని సూచనలు పాటించాలి.


క్లినికల్‌ ట్రయల్స్‌తో పలుమార్లు పరీక్షించి, ప్రాంతీయంగా తయారుచేసిన వ్యాక్సిన్‌ అయినా కొన్ని సందర్భాల్లో రియాక్షన్‌ను కలిగించవచ్చు. మరీ ముఖ్యంగా అలర్జీ తత్వం కలిగినవారికి వ్యాక్సిన్‌తో రియాక్షన్‌ తలెత్తే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కోవకు చెందినవాళ్లు...


తమకున్న అలర్జీల గురించి వ్యాక్సిన్‌ తీసుకునే ముందు వైద్యులకు తెలియపరచాలి.

ఇటీవలి కాలంలో ఫుడ్‌ అలర్జీలకు గురై ఉంటే, ఆ అలర్జీకి చికిత్స పూర్తయిన తర్వాతే వ్యాక్సిన్‌ తీసుకోవాలి.

చర్మం మీద దద్దుర్లతో కూడిన అలర్జీకి గురైనవారు ఆ సమస్య పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే వ్యాక్సిన్‌ తీసుకోవాలి. 

వ్యాక్సిన్‌కు ముందు అనుభవజ్ఞులైన అలర్జిస్ట్‌, లేదా ఇమ్యునాలజి్‌స్టల అభిప్రాయం తెలుసుకోవాలి.

ఇటీవలి కాలంలో అలర్జీ రియాక్షన్‌కు గురైనవారు వ్యాక్సిన్‌ సమయంలో తోడుగా ఎవరినైనా వెంట ఉంచుకోవాలి. అలాగే వాడుతున్న మందుల వివరాలు వైద్యులకు తెలపాలి.

ఎపినెఫ్రిన్‌ ఇంజెక్షన్‌ను వెంట తీసుకువెళ్తే, అత్యవసర పరిస్థితిలో అక్కరకు రావచ్చు.

Updated Date - 2021-01-26T06:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising