ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగ సమానత్వానికి ఇంకొన్ని ఏళ్లు!

ABN, First Publish Date - 2021-04-01T05:30:00+05:30

అభివృద్ధి నినాదంతో పరుగులు పెడుతున్న ఆధునిక యుగంలోనూ లింగ సమానత్వం ఇప్పటికీ మాటలకే పరిమితం అయిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభివృద్ధి నినాదంతో పరుగులు పెడుతున్న ఆధునిక యుగంలోనూ లింగ సమానత్వం ఇప్పటికీ మాటలకే పరిమితం అయిపోయింది. లింగ సమానత్వం సాధించేందుకు 99 ఏళ్లకు పైగా పడుతుందని గత ఏడాది ప్రపంచ ఆర్థిక సమాఖ్య (డబ్య్లూఈఎఫ్‌) చెప్పింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా లింగ సమానత్వం సాకారం అయ్యేందకు 136 ఏళ్లు పట్టనుందని డబ్య్లూఈఎఫ్‌ తాజాగా వెల్లడించింది.


‘‘పనిప్రదేశాల్లోనే కాదు ఇంటి వద్ద కూడా లింగ సమానత్వాన్ని కరోనా ఎంతో ప్రభావితం చేసింది. ఈ పరిస్థితిలో మార్పు వచ్చేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది’’ అంటున్నారు డబ్య్లూఈఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాదియా జాహిదీ. మహిళలు ఎక్కువగా పనికి కుదిరే పరిశ్రమలు లాక్‌డౌన్‌ దెబ్బతో మూతపడ్డాయి. దీనికి తోడు ఇంట్లో వేధింపులు మహిళలను మగవారితో సమానంగా నిలిచే దూరాన్ని మరింత పెద్దవి చేశాయని డబ్య్లూఈఎఫ్‌ నివేదిక అంటుంది.


‘లాక్‌డౌన్‌ మూలంగా మహిళలు అధికంగా ఉపాధి పొందే వినియోగదారుల రంగం వాటిపై తీవ్ర ప్రభావం పడింది. దాంతో చాలామంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు’ అని చెబుతున్న అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాలను ప్రపంచ ఆర్థిక సమాఖ్య ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఐస్‌లాండ్‌ దేశం లింగ సమానత్వంలో ముందు వరుసలో ఉందని, పశ్చిమ యూరప్‌లో కొంత పర్లేదని, మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికాలో లింగ సమానత్వంలో అంతరం ఎక్కువగా ఉందని ఈ నివేదిక చెబుతోంది.


Updated Date - 2021-04-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising