ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వయసును ఓడిస్త్తున్న డ్యాన్సర్‌...

ABN, First Publish Date - 2021-02-22T06:17:27+05:30

సంప్రదాయం, జానపదం... పాట ఏదైనా హుషారైన డాన్స్‌తో వారెవ్వా అనిపిస్తారు రవిబాల శర్మ. 62ఏళ్ల వయసులో డాన్స్‌ వీడియోలతో బాలీవుడ్‌ సెలబ్రిటీల మెప్పు పొందడమే కాదు మనసుకు నచ్చిన పని చేసేందుకు వయసుతో సంబంధం లేదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంప్రదాయం, జానపదం... పాట ఏదైనా హుషారైన డాన్స్‌తో వారెవ్వా అనిపిస్తారు రవిబాల శర్మ. 62ఏళ్ల వయసులో డాన్స్‌ వీడియోలతో బాలీవుడ్‌ సెలబ్రిటీల మెప్పు పొందడమే కాదు మనసుకు నచ్చిన పని చేసేందుకు వయసుతో సంబంధం లేదని చాటుతున్నారు. నేర్చుకోవాలనే తపన, కష్టపడే స్వభావం ఉంటే మనసుకు నచ్చిన పనిని ఏ వయసులోనైనా చేయగలమని నిరూపిస్తున్న ఈ ‘డాన్సింగ్‌ దాదీ’ నృత్య ఘరి ఇది....


‘‘స్కూలు రోజుల నుంచే నాకు డాన్స్‌ అంటే చాలా ఇష్టం. మా నాన్న శ్రీశాంతి స్వరూప్‌ శర్మ దగ్గర కథక్‌ నృత్యం నేర్చుకున్నాను. పెద్దయ్యాక డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకోవానుకునేదాన్ని. అయితే మా ఇంట్లోవాళ్లు నాకు కాలేజీ అవగానే పెళ్లి చేశారు. కుటుంబ బాధ్యతలు పెరగడంతో డాన్స్‌ ఆపేశాను’’ అంటున్న రవి బాల శర్మ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌. ప్రస్తుతం ముంబయిలో కుమారిడితో కలిసి ఉంటున్నారామె.


భర్త మరణాన్ని దిగమింగి

పెళ్లైన ఇరవై ఏడేళ్లకే రవిబాల భర్త చనిపోయారు. ఆ బాధ నుంచి తేరుకోవడం ఆమె వల్ల కాలేదు. ఆ సమయంలో డ్యాన్స్‌ ఒక్కటే ఆమెను తిరిగి మామూలు మనిషిని చేయగలదని ఆత్మీయులు భావించారు. అలా అందరి ప్రోత్సాహంతో తన కలల బాటలో అడుగులేశారు రవి బాల. సోదరితో కలిసి డ్యాన్స్‌ ఆడిషన్‌కు వెళ్లిన ఆమె ఇంటర్నెట్‌లో సంచలనం అవుతానని కలలో కూడా అనుకోలేదు. 




సెలబ్రిటీలు ఆమె అభిమానులు

‘‘ఆడిషన్‌లో వహీదాజీ పాటకు బాంగ్రా నృత్యం చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాను. ఆ రోజు నుంచి డాన్స్‌ వీడియోలు పోస్ట్‌ చేయడం కొనసాగిస్తున్నాను’’ అంటున్న రవి బాల డ్యాన్స్‌ వీడియోలు చూసి సెలబ్రిటీలు ఆమె అభిమానులు అయ్యారు. గాయకుడు దిల్జీత్‌ దోసంజ్‌, నిర్మాత ఇంతియాజ్‌ ఆలీ, కొరియోగ్రాఫర్‌ టెరెన్స్‌ లెవిస్‌ రవిబాల డ్యాన్స్‌ వీడియోలను లైక్‌ చేయడమే కాదు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు కూడా. 62 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా, హావభావాలు పలికిస్తున్న రవిబాల డ్యాన్స్‌ వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో లక్షమందికి పైగా చూస్తున్నారు. ‘‘ఇలాంటిది జరుగుతుందని గానీ, నా 62 ఏళ్ల వయసులో నా కల నిజమవుతుందని గానీ నేనెప్పుడూ ఊహించలేదు. నా కూతురు, కొడుకు స్థిరపడ్డారు. పెద్దగా బాధ్యతలేవీ లేవు. అందుకే నా ప్యాషన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నా. సీనియర్‌ సిటిజన్స్‌, రిటైర్‌ అయినవారికి నేను చెప్పేది ఒక్కటే గతంలో జీవించకండి. మీ కుటుంబం కోసం మీరు చాలా చేశారు. ఇప్పుడు మీకు నచ్చిన పని చేయండి. జీవితం ఉన్నది ఎంజాయ్‌ చేయడానికి. వయసు అనేది ఒక అంకె మాత్రమే’’ అంటున్న ఈ ‘డ్యాన్సింగ్‌ దాదీ’ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Updated Date - 2021-02-22T06:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising