ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు ఈ వారంలో మరో మూడు కరోనా టీకాలు!

ABN, First Publish Date - 2021-08-17T13:57:21+05:30

దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌కు ఈ వారం మరింత కీలకం కానుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీవో) సబ్జక్ ఎక్స్‌పర్ట్ కమిటీ వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడు అభ్యర్థనలను సమీక్షించనుంది. వీటిలో జైడస్ కాడిలా, కోవాక్స్, స్పుత్నిక్ లైట్ ఉన్నాయి. 


ఒకవేళ ఈ మూడు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తే, భారత ప్రభుత్వం భావిస్తున్న విధంగా ఈ ఏడాది చివరినాటికి దేశంలోని ప్రజలందరికీ టీకాలు వేయాలన్న లక్ష్యం నెరవేరనున్నది. నిపుణుల కమిటీ ముందుగా అహ్మదాబాద్‌ నుంచి ఉత్పత్తి అవుతున్న జైడస్ కాడిలా వ్యాక్సిన్‌పై సమీక్షించనుంది. ఈ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన ట్రయల్స్ డేటాను కంపెనీ ప్రభుత్వానికి అందించింది. ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభించినట్లయితే కోవాగ్జిన్ తరువాత ఇది రెండవ స్వదేశీ వ్యాక్సిన్‌గా నిలవనున్నది.

Updated Date - 2021-08-17T13:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising