ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో బయటపడిన తొలి జికా వైరస్ కేసు

ABN, First Publish Date - 2021-10-24T23:01:04+05:30

ఉత్తరప్రదేశ్‌లో తొలి జికా వైరస్ కేసు బయటపడింది. కాన్పూర్‌లోని పోఖాపూర్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఒకరికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో తొలి జికా వైరస్ కేసు బయటపడింది. కాన్పూర్‌లోని పోఖాపూర్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఒకరికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు. పేషెంట్స్ శాంపుల్స్ పరీక్షల కోసం పుణె పంపగా, నివేదకలో పాజిటివ్ అని తేలిందని, దీంతో ఆ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ శానిటైజ్ చేసిందని చెప్పారు. పేషెంట్‌తో సన్నిహత సంబంధాలున్న 200 మందిని ఐసొలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కాన్పూర్ చీఫ్ మెడికల్ అధికారి నేపాల్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు ముందు కేరళ, మహారాష్ట్రలో జికా వైరస్ కనుగొన్నారు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సమాచారం ప్రకారం, యుగాండాలోని జికా అనే అడవి పేరు ఈ వైరస్‌కు పెట్టారు. మొట్టమొదటగా 1947లో యుగాండా అడవిలోని కోతుల్లో ఈ వైరస్ కనిపించింది. ఆ తరువాత 1952లో మనుషుల్లోనూ వీటిని గుర్తించారు. ఏడిస్ జాతి దోమల ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది. డెంగీ, చికున్ గున్యాలు కూడా ఈ దోమల ద్వారానే వ్యాపిస్తాయి. జికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్రబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 2-7 రోజుల పాటు ఇవి కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించొచ్చు. సెక్యువల్ ఇంటర్‌కోర్స్ ద్వారా కూడా వ్యాధి వ్యాపించవచ్చు. గర్భిణుల నుంచి పుట్టబోయే బిడ్డకూ ఇది సంక్రమించవచ్చు. దానివల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. గర్భస్రావం జరిగే ప్రమాదమూ ఉంది.

Updated Date - 2021-10-24T23:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising