ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడ్ న్యూస్.. 19 రాష్ట్రాల్లో కరోనా మరణాలు లేవు

ABN, First Publish Date - 2021-03-03T00:18:32+05:30

కరోనా మహమ్మారికి మళ్లీ బుసలుకొడుతుండటంతో హడలెత్తిపోతున్న భారత్‌లో ఇన్నాళ్లకు ఓ శుభవార్త వచ్చింది. గత 24 నాలుగు గంటల్లో దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు సంభవించలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి మళ్లీ బుసలుకొడుతుండటంతో హడలెత్తిపోతున్న భారత్‌లో ఇన్నాళ్లకు ఓ శుభవార్త వచ్చింది.  గత 24 నాలుగు గంటల్లో దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు సంభవించలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అయితే.. కొత్తగా 12286 కరోనా కేసులు వెలుగు చూడటంతో మొత్తం కేసుల సంఖ్య1,11,24,527కి చేరుకుంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 168358గా ఉంది. 


మరోవైపు.. ఐదు రాష్ట్రాల్లో కరోనా ఉదృత్తి కొనసాగుతోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌లో రోజువారి కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 91 కరోనా మరణాలు సంభవించగా మహారాష్ట్ర(30), పంజాబ్(18), కేరళ(13) తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి.  కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 10798921కి చేరుకోవడంతో రివరీ రేటు 97.07గా ఉంది. ఇక పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉంది.


సోమవారం నుంచి ప్రారంభమైన రెండో దశ కరోనా టీకా కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతోంది. ఈ విడతలో 60 ఏళ్లు పైబడిన వారి, 45 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నావారికి టీకా పొందే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇక కేంద్రం లెక్కల ప్రకారం.. మంగళవారం ఉదయానికి 1.5 కోట్ల మంది టీకా వేసుకున్నారు. సోమవారం ఒక్కరోజులోనే 29 లక్షల మంది టీకా కోసం కొవిన్ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. 


Updated Date - 2021-03-03T00:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising