ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూట్యూబ్‌ చూస్తూ ప్రసవం

ABN, First Publish Date - 2021-12-21T15:25:49+05:30

యూట్యూబ్‌ చూస్తూ భార్యకు ప్రసవం చేయడంతో జన్మించిన మగశిశువు మృతిచెందగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. రాణిపేట జిల్లా నెమిలి సమీపం నెడుంపుల్లి గ్రామానికి చెందిన లోకనాథన్‌ కొయ్య పనులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                   - శిశువు మృతి, మహిళ పరిస్థితి విషమం


వేలూరు(చెన్నై): యూట్యూబ్‌ చూస్తూ భార్యకు ప్రసవం చేయడంతో జన్మించిన మగశిశువు మృతిచెందగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. రాణిపేట జిల్లా నెమిలి సమీపం నెడుంపుల్లి గ్రామానికి చెందిన లోకనాథన్‌ కొయ్య పనులు చేస్తుంటాడు. అతనికి గోమతి (28)తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న గోమతికి ఈ నెల 13న ప్రసవం అవుతుందని వైద్యులు తెలిపారు. అయినా ఆరోజు నొప్పులు రాలేదు. 18న హఠాత్తుగా నొప్పులు రావడంతో లోకనాథన్‌ తన అక్క సీతతో కలసి యూ ట్యూబ్‌ చూస్తూ ప్రసవం చేశాడు. అప్పుడు జన్మించిన మగశిశువు మృతిచెందగా, గోమతికి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో ఆమెను పొన్నై ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సల అనంతరం వేలూరు ప్రభుత్వాసుపత్రికి పంపారు. ఈ ఘటనపై నెమిలి పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - 2021-12-21T15:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising