ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

yediyurappa : నేను ఎవరి పేరూ చెప్పను.. మీరే చూడండి..

ABN, First Publish Date - 2021-07-22T22:40:07+05:30

మరో మూడు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయబోతున్నారని వార్తలు వస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : మరో మూడు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజీనామా చేయమని ఇప్పటి వరకూ తనను ఎవరూ అడగలేదని స్పష్టం చేశారు. ఎప్పుడైతే అధిష్ఠానం రాజీనామా చేయమని ఆదేశిస్తుందో, వెంటనే రాజీనామాకు సిద్ధమని, పార్టీ విస్తరణలో పాలుపంచుకుంటానని ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరునూ సూచించనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకైతే అధిష్ఠానం తనపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని, జూలై 26 న ఏం జరుగుతుందో మీరే చూడాలంటూ యడియూరప్ప వ్యాఖ్యానించారు. 


కర్ణాటకలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిని మారుస్తారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తూ.. సంకేతాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 26తో యడియూరప్ప సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలో 25న పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశారు. ఇది వారం రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే.. హఠాత్తుగా ఈ విందుకు బ్రేక్‌ పడింది. విందు, వినోదాలు వంటివి ఏమీ లేవని తాజాగా ప్రకటన జారీ చేశారు. అంతేకాదు, 26న సోమవారం రెండేళ్ల పాలనపై ‘సాధన’ పేరిట కార్యక్రమం నిర్వహించనున్నామని.. విధాన సౌధలోని బ్యాంకెట్‌హాల్‌లో ఈ కార్యక్రమం సాదాసీదాగానే జరుగుతుందని చీఫ్‌విప్‌ సునీల్‌కుమార్‌ బుధవారం మీడియాకు తెలిపారు. కాగా, మంత్రి శ్రీరాములుకు అధిష్ఠానం నుంచి ఢిల్లీకి రావాలని పిలుపువచ్చింది. ఈ నెల 26 తర్వాత సీఎం మార్పు తప్పదనే సంకేతాలు వెలువడుతుండడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఎలాంటి పిలుపు లేకుండానే హస్తినబాట పట్టారు. గుజరాత్‌ పర్యటనలో ఉన్న మంత్రి జగదీశ్‌ శెట్టర్‌ అటునుంచి అటే ఢిల్లీ వెళ్లారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్యే రేణుకాచార్య ఢిల్లీ బయల్దేరారు. 


Updated Date - 2021-07-22T22:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising