దూసుకొస్తున్న యాస్ తుఫాన్.. అప్రమత్తమై ఒడిశా
ABN, First Publish Date - 2021-05-25T19:47:13+05:30
యాస్ తుఫాన్ దూసుకొస్తోంది.. దీంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఒడిశా: యాస్ తుఫాన్ దూసుకొస్తోంది.. దీంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రచండగాలుల వేగానికి పూరిగుడిసెలు కొట్టుకుపోతుండడంతో అందులో ఉంటున్నవారిని సురక్షిత కేంద్రాలకు తరలిస్తున్నారు. ఓ పూరిగుడిసె గాలులకు కొట్టుకుపోగా అందులో ఉన్న 91ఏళ్ల వృద్ధురాలిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని సిబ్బంది డోలీలో తీసుకువెళ్లారు.
యాస్ తుఫాన్ కారణంగా తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఏపీలో కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. బుధవారం ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సముద్రం అలజడిగా ఉంటుందని, సముద్రంలో అలలు 4.5 మీటర్ల ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఈనెల 27వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను కేంద్రం హెచ్చరించింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎండీ కమిషనర్ కన్నబాబు సూచించారు. రాష్ట్రంలో విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం రేవుల్లో రెండో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. కలింగపట్నం సహా ఇతర ఓడరేవులకు అధికారులు తుపాను సమాచారం అందించారు.
Updated Date - 2021-05-25T19:47:13+05:30 IST