ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ పర్మినెంట్ సస్పెన్షన్!

ABN, First Publish Date - 2021-01-21T21:31:26+05:30

నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపేవారిపై కఠిన చర్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురుగ్రామ్ : నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానాలోని గురుగ్రామ్ పోలీసులు నిర్ణయించారు. రోడ్డుపై రాంగ్ సైడ్‌లో వాహనాన్ని నడిపినవారి డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. 


అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రీత్ పాల్ సింగ్  మీడియాతో మాట్లాడుతూ, గురుగ్రామ్‌లో రోడ్డుపై రాంగ్ సైడ్‌లో వాహనాన్ని నడిపినవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ నిర్ణయించారన్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినవారి లైసెన్స్‌ను సస్పెండ్ చేయడంతోపాటు చలాన్లు విధించాలని ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇదే తప్పును మరోసారి చేస్తే, డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఒకసారి లైసెన్స్ సస్పెండయితే, ఇక భవిష్యత్తులో డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసే అవకాశం ఉండదన్నారు. 


రాంగ్ సైడ్‌లో వాహనాలను నడిపినందుకు  2020లో 39,765 మందికి, 2019లో 49,671 మందికి మోటారు వాహనాల చట్టం ప్రకారం చలానాలు విధించినట్లు చెప్పారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసి, ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌కు కనీసం పదేళ్ల శిక్ష విధించే అవకాశం ఉండేవిధంగా ఐపీసీ సెక్షన్ 304(2) ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. 


Updated Date - 2021-01-21T21:31:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising