ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్రికా స్వేచ్ఛలో మరింత దిగజారిన భారత్ ర్యాంక్

ABN, First Publish Date - 2021-06-22T16:26:44+05:30

మీడియా నిజాలు చెబితేనే పాలకులు జాగ్రత్తగా ఉంటారు. కానీ ప్రజాస్వామ్య దేశాల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులాంటిది పత్రికా స్వేచ్ఛ. మీడియా నిజాలు చెబితేనే పాలకులు జాగ్రత్తగా ఉంటారు. కానీ ప్రజాస్వామ్య దేశాల్లో రాను రాను నియంతృత్వ పోకడలు పెరిగిపోతున్నాయి. ఇండియాలో ఇంకా దారుణంగా ఉన్నాయి. ఫలితంగా మీడియా స్వేచ్ఛ ఇండియాలో అట్టడుగుకు వెళ్లిపోతోంది. అధికార పార్టీ నేతల అవినీతిని ప్రశ్నిస్తే కేసులు. విపక్ష నేతల ప్రెస్ మీట్లు ప్రసారం చేస్తే దేశద్రోహం కేసులు.. నిజమైనా సరే.. తమకు వ్యతిరేకమైనవి చెబితే మీడియా సంస్థల ఆర్థిక పునాదులు కూల్చివేతకు తెగబడే ప్రభుత్వాలు.. ఇప్పుడు భారత్‌లో ఏ మూల చూసినా కనిపిస్తున్నాయి. 


ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటి మీడియాను నియంత్రించేందుకు ప్రజాస్వామ్యం ద్వారా వచ్చిన అధికారాన్ని పాలకులు  వినియోగిస్తున్నారు. తమకు అధికారం తెచ్చిపెట్టిన ప్రజాస్వామ్యాన్నే బలహీనం చేస్తున్నారు. దేశం మెల్లగా నియంతృత్వ దిశగా వెళుతోందని, ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్’ సూచికలో భారత్‌‌ 142వ ర్యాంక్‌కు దిగజారి.. ఆ పరిస్థితి మరింత వేగంగా రాబోతోందని సంకేతాలు పంపింది.

Updated Date - 2021-06-22T16:26:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising