ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భిణికి కరోనా టీకా..బిడ్డకు పుట్టుకతోనే..! ప్రపంచంలోనే తొలిసారిగా..

ABN, First Publish Date - 2021-03-17T22:13:09+05:30

అమెరికాలో కరోనా టీకా తీసుకున్న గర్భిణి ఇటీవల ప్రసవించింది. దీంతో..ఆ బిడ్డ శరీరంలో పుట్టుకతోనే కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో కరోనా టీకా తీసుకున్న గర్భిణి ఇటీవల ప్రసవించింది. దీంతో..ఆ బిడ్డ శరీరంలో పుట్టుకతోనే కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కరోనా టీకా విషయంలో ఇటువంటి ఘటన జరగడం ప్రపంచంలోనే తొలిసారని వారు చెబుతున్నారు. దక్షిణ ఫ్లోరిడాకు చెందిన సదరు మహిళ హెల్త్ కేర్ వర్కర్‌గా సేవలందిస్తుంటుంది. ఏనిమిదెల గర్భంతో ఉన్నప్పుడు ఆమె మోడర్నా రూపొందించిన కరోనా టీకా తీసుకున్నారు. దీంతో.. తల్లి నుంచి బిడ్డకు కరోనా యాంటీబాడీలు బదిలీ అవుతాయా లేదా అనే ప్రశ్నకు సమాధానం కునుక్కునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. 


అయితే.. టీకా తీసుకున్న మూడు వారాలకు ఆమె బిడ్డను ప్రసవించింది. అయితే..కాన్పు తరువాత బొడ్డు తాడులో యాంటీబాడీలను గుర్తించినట్టు వైద్యులు డా. పాల్ గిల్బర్ట్, డా. ఛాడ్ రడ్నిక్ పేర్కొన్నారు. గర్భిణులకు ఇతర టీకాల ఇచ్చాక తల్లి నుంచి బిడ్డకు యాంటీబాడీలు చేరుతాయి. కరోనా టీకా విషయంలోనూ ఇదే విధంగా జరుగుతుందని తొలిసారి బయటపడింది అని వారు తెలిపారు. అయితే..ఈ యాంటీబాడీలు శిశువుకు కరోనా నుంచి  రక్షణ నిస్తాయో లేదో తెలుసుకునేందుకు మరింత అధ్యయనం అవసరమని వారు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-03-17T22:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising