ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ వలస కూలీల మరణ ధ్రువపత్రాల జారీలో జాప్యం... ఆవేదనలో కుటుంబ సభ్యులు...

ABN, First Publish Date - 2021-03-28T01:29:23+05:30

కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. అనేక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. అనేక మంది వలస కూలీలు నానా అవస్థలు పడుతూ సొంతూళ్ళకు తరలిపోవలసి వచ్చింది. పొట్ట చేతపట్టుకుని నగరాలకు వచ్చినవారికి ఉపాధి దొరకని పరిస్థితి ఎదురవడంతో కాలి నడకన సొంతూళ్ళకు వెళ్ళారు. అలా బయల్దేరినవారిలో 16 మంది గత ఏడాది మే నెలలో ఓ రైలు క్రింద నలిగి, ప్రాణాలు కోల్పోయారు. వీరికి మరణ ధ్రువీకరణ పత్రాలు ఇప్పటికీ జారీ అవలేదు. వీరి కుటుంబ సభ్యులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. 


మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో ఓ రైలు క్రింద నలిగిపోయి, 16 మంది వలస కూలీలు గత ఏడాది మే నెలలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది మహారాష్ట్రలోని షాడోల్ జిల్లాకు చెందినవారు కాగా, ఐదుగురు మధ్యప్రదేశ్‌లోని ఉమేరియా జిల్లాకు చెందినవారు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది. 


జల్నా నుంచి నడుచుకుంటూ వచ్చి, 2020 మే ఎనిమిదిన కర్మద్ వద్ద రైలు పట్టాలపై వీరంతా సేదదీరారు. అనుకోకుండా ఓ రైలు వీరిపై నుంచి దూసుకెళ్లింది. ఔరంగాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో కర్మద్ ఉంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి భార్య సునీత సింగ్ మీడియాతో మాట్లాడుతూ, తన భర్త మరణ ధ్రవీకరణపత్రం కోసం జైసింగ్ నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేశామని చెప్పారు. అయితే దుర్ఘటన జరిగిన ప్రాంతానికి చెందిన అధికారులే మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారని జైసింగ్ నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ చెప్తున్నారన్నారు. ఈ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే వితంతు పింఛనును పొందే అవకాశాన్ని తాను కోల్పోతున్నానని తెలిపారు. దీపక్ సింగ్ భార్య చంద్రావతి మాట్లాడుతూ, తన భర్త డెత్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నానని తెలిపారు. 


జైసింగ్ నగర్ ఎస్‌డీఎం దిలీప్ పాండే మాట్లాడుతూ, దుర్ఘటన జరిగిన ప్రదేశంపై అధికార పరిధి కలిగిన అధికారులు మాత్రమే మరణ ధ్రవీకరణ పత్రాలను జారీ చేయాలని చెప్పారు. ఈ విషయంలో తాము ఔరంగాబాద్ జిల్లా అధికారులకు రెండు లేఖలను రాశామని చెప్పారు. షాడోల్ జిల్లా కలెక్టర్ కూడా ఔరంగాబాద్ జిల్లా కలెక్టర్‌తో ఈ విషయం గురించి మాట్లాడారని చెప్పారు. 


Updated Date - 2021-03-28T01:29:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising