ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రమశిక్షణతో కూడిన ఆర్మీ ఏర్పాటు చేస్తాం: తాలిబన్

ABN, First Publish Date - 2021-09-16T01:53:00+05:30

ప్రజల నుంచి ఎలాంటి తిరుగుబాటు రాకుండా చూసుకుంటాం. భద్రతా దళాలను, ఇతర అధికారిక కార్యలాపాలను అడ్డుకోవడం, తాలిబన్‌ను వ్యతిరేకించే చర్యలకు దిగితే వెంటనే అరెస్ట్ చేస్తాం. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. దేశానికి కూడా ఆర్మీ అవసరం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: అఫ్ఘానిస్తాన్‌లో క్రమశిక్షణతో కూడా శాశ్వాత ఆర్మీని ఏర్పాటు చేస్తామని తాలిబన్ ఆర్మీ తాత్కాలిక చీఫ్ ఖారీ ఫసిహుద్దిన్ ప్రకటించారు. బుధవారం అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అఫ్ఘాన్‌ను తాలిబన్ ఆక్రమించుకున్న తర్వాత అఫ్ఘాన్ జాతీయ ఆర్మీని రద్దు చేశారు. తాలిబన్ నేతృత్వంలో ఆర్మీ ఏర్పడుతుందని అందరూ అనుకున్నట్లే తొందరలోనే ప్రకటన చేశారు.


‘‘ప్రజల నుంచి ఎలాంటి తిరుగుబాటు రాకుండా చూసుకుంటాం. భద్రతా దళాలను, ఇతర అధికారిక కార్యలాపాలను అడ్డుకోవడం, తాలిబన్‌ను వ్యతిరేకించే చర్యలకు దిగితే వెంటనే అరెస్ట్ చేస్తాం. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. దేశానికి కూడా ఆర్మీ అవసరం. క్రమశిక్షణతో కూడిన శాశ్వాత ఆర్మీని ఏర్పాటు చేస్తాం’’ అని ఖారీ తెలిపారు. ఇదే విషయమై తాలిబన్ అధికార ప్రతినిధి అహ్మదుల్లా ముత్తాఖి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘త్వరలోనే నిష్ణాతులైన ఆర్మీ ఫోర్స్ ఏర్పాటు కాబోతోంది’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2021-09-16T01:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising