ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు చట్టాలు రద్దు చేసేంత వరకూ వెనక్కి తగ్గం: టికాయత్

ABN, First Publish Date - 2021-07-22T01:00:57+05:30

కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకునేంత వరకూ రైతుల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకునేంత వరకూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ టికాయత్ తెలిపారు. సాగు చట్టాల రద్దు డిమాండ్‌పై ఎనిమిది నెలలుగా జరుపుతున్న ఆందోళనకు కొనసాగింపుగా జంతర్‌మంతర్‌ వద్ద గురువారం నుంచి  'కిసాన్ పార్లమెంటు'ను రైతు సంఘాలు నిర్వహించనున్నాయి. దీనిపై టికాయత్ బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, గురువారం 200 మంది రైతులు సింధు సరిహద్దు నుంచి నాలుగు బస్సుల్లో జంతర్ మంతర్ వెళ్తారని చెప్పారు. వివిధ నిరసన స్థలాల నుంచి అందరూ సింధు సరిహద్దుకు చేరుకుని అక్కడ్నించి జంతర్ మంతర్ వెళ్తారని తెలిపారు. సాగు చట్టాలను కేంద్ర వెనక్కి తీసుకునేంత వరకూ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని, జంతర్ మంతర్ వద్ద ఆందోళన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకూ ఉంటుందన్నారు. ఎంతకాలం రైతు ఆందోళన సాగినా ప్రశాంతంగా, సరైన పద్ధతిలోనే సాగుతుందని తెలిపారు.

Updated Date - 2021-07-22T01:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising