ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియాంక గాంధీకి ఫడ్నవిస్ కౌంటర్..!

ABN, First Publish Date - 2021-04-21T22:56:02+05:30

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర స్థాయిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల సలహాలను పట్టించుకోవడం లేదంటూ ప్రియాంక చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. కొవిడ్-19 సెకండ్ వేవ్‌ను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ప్రియాంక గాంధీ మహారాష్ట్ర సర్కారుకు ఎందుకు సలహాలు ఇవ్వడం లేదంటూ ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశంలో ఫడ్నవిస్ మాట్లాడుతూ... ‘‘కాంగ్రెస్, గాంధీ కుటుంబాలు ప్రతికూల వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. మహారాష్ట్రలోని తన ప్రభుత్వంలో ప్రియాంక గాంధీ ఎప్పుడైనా చర్చించారా అని నేను అడుగుతున్నాను. అక్కడి పరిస్థితి ఎలాగుంది? దేశంలో నమోదవుతున్న కొవిడ్ మరణాల్లో 38-40 శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి...’’ అని పేర్కొన్నారు. మొత్తం కరోనా కేసుల్లో 35-40 శాతం మహారాష్ట్ర నుంచే ఉన్నాయనీ.. యాక్టివ్ కేసుల్లో కూడా 35-37 శాతం కేసులు ఇక్కడే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘‘గతంలో మహారాష్ట్రలో కొవిడ్ దారుణ ప్రభావం చూపినప్పటికీ... మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సిద్ధంకాలేదు? ప్రియాంక, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలు ఎందుకు ఒక్క లేఖ కూడా రాయలేదు. మీడియా సమావేశాలు ఎందుకు పెట్టలేదు? మహారాష్ట్రకు ఎందుకు సలహాలు ఇవ్వలేదు?..’’ అంటూ ఫడ్నవిస్ ప్రశ్నలు కురిపించారు. 


కాగా నిన్న ప్రియాంక గాంధీ మాట్లాడుతూ... కొవిడ్-19 కల్లోలంలో ప్రజల పట్ల కేంద్ర తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. ఓ వైపు ఆక్సిజన్, మందులు, ఆస్పత్రుల్లో బెడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఎన్నికల ర్యాలీల్లో నవ్వుతూ తిరుగుతున్నారని ఆమె మండిపడ్డారు. ‘‘కేంద్రం ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ (ఐఎస్ఐ)తో మాట్లాడగలదు. దుబాయ్‌లో ఐఎస్ఐతో వాళ్లు మాట్లాడతారు. మరి ప్రతిపక్ష నేతలతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నిర్మాణాత్మక, సానుకూల సలహాలు ఇవ్వని ప్రతిపక్ష నేత ఒక్కరైనా ఉంటారని నేనైతే భావించడం లేదు..’’ అని ఆమె ప్రశ్నించారు. 

Updated Date - 2021-04-21T22:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising