ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిన్‌‌పింగ్‌కు ఇబ్బంది కలగొద్దని డబ్ల్యూహెచ్ఓ ఏం చేసిందంటే!

ABN, First Publish Date - 2021-11-27T22:23:56+05:30

కరోనా వైరస్ కొత్త వేరియంట్‌కు పేరు పెట్టడంలో ప్రపంచ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా వైరస్ కొత్త వేరియంట్‌కు పేరు పెట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చాకచక్యం ప్రదర్శించింది. గ్రీకు వర్ణమాలలోని అక్షరాలతో ఈ వైరస్ రూపాంతరాలకు పేర్లు పెడుతుండగా, దక్షిణాఫ్రికాలో కనిపించిన కొత్త వేరియంట్‌ B.1.1.529కు రెండు అక్షరాలను వదిలేసింది. దీనికి కారణం చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌పింగ్ గుర్తుకొచ్చే పరిస్థితి తలెత్తడమే. 


తెలుగు అక్షరమాలలోని అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ...., ఆంగ్ల అక్షరమాలలోని ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్... మాదిరిగా గ్రీకు అక్షరమాలలో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా... ఉన్నాయి. ఓ కోవిడ్ వేరియంట్‌కు ఈ అక్షరాలలోని డెల్టాను పెట్టారు. ఆ తర్వాత కొత్తగా వచ్చే వేరియంట్‌కు ‘ను’ అని పేరు పెట్టవలసి ఉంటుంది. అయితే గ్రీకు అక్షరమాలలో ‘ను’ తర్వాత ‘షి’ వస్తుంది. ఈ ‘షి’ అనే శబ్దం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేరులో ఉంది. ఇప్పటికే కోవిడ్ చైనాలో ప్రారంభమైందని, దీనిపై సరైన సమాచారాన్ని ప్రపంచానికి  చైనా అందించలేదని పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రీకు వర్ణమాలలోని ‘ను’, ‘షి’ అక్షరాలను వదిలేసి, ఆ తర్వాత వచ్చే అక్షరం ‘ఒమిక్రాన్’ పేరును కొత్త వేరియంట్‌కు పెట్టింది. 


డబ్ల్యూహెచ్ఓ ప్యానెల్ శుక్రవారం సమావేశమైంది. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానాల్లో కనిపించిన కొత్త కోవిడ్ రూపాంతరం చాలా ఆందోళనకరమైనదని పేర్కొంది. దీనిని ‘ఒమిక్రాన్’ వేరియంట్‌గా పిలుస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ మార్టిన్ కుల్‌డోర్ఫ్ ఓ ఊహాజనిత కారణాన్ని వెల్లడించారు. ‘షి’ స్ట్రెయిన్‌గా కొత్త వేరియంట్‌ను పిలిస్తే ఎదురయ్యే అవకాశం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అటువంటి పరిస్థితిని నివారించడం కోసమే ‘ఒమిక్రాన్’ వేరియంట్ అని పేరు పెట్టి ఉంటారని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 


SARS-CoV-2 కొత్త వేరియంట్ B.1.1.529కు ‘ను’ అని పేరు పెడతారని అంతకుముందు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ డబ్ల్యూహెచ్ఓ నిర్ణయం వెలువడటంతో ‘ది టెలిగ్రాఫ్’ సీనియర్ ఎడిటర్ పాల్ నుకి స్పందిస్తూ, ఈ పేరు పెట్టడం వెనుక కారణాలను డబ్ల్యూహెచ్ఓ అధికారి ఒకరు వెల్లడించినట్లు తెలిపారు. ‘ను’ అని పెడితే ‘న్యూ’ (కొత్త) అని అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని, అదేవిధంగా ‘షి’ అని పెడితే చైనాకు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటుందని భావించి, ఈ రెండు అక్షరాలను వదిలిపెట్టినట్లు ఆ అధికారి చెప్పారని పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-27T22:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising