ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా టీకాకు అత్యవసర అనుమతి!

ABN, First Publish Date - 2021-06-02T02:26:29+05:30

ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం నాడు చైనా కరోనా టీకా సైనోవాక్‌కు అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మంగళవారం నాడు చైనా కరోనా టీకా సైనోవాక్‌కు అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ ఓ ప్రకటన విడుదల చేసింది. డబ్ల్యూహెచ్ఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండో చైనా టీకా సైనోవాక్. ‘‘సైనోవాక్‌కు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర అనుమతిని మంజూరు చేసింది. ఈ టీకా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగూణంగా రూపుదిద్దుకుందని వివిధ దేశాలు, సంస్థలకు మేం హామీ ఇస్తున్నాం’’ అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీంతో..కొవ్యాక్స్ కార్యక్రమం కింద పేద దేశాలకు సైనోవాక్ పంపిణీ చేసేందుకు మార్గం సుగమమైంది. కరోనా రెండో వేవ్ కారణంగా భారత్ టీకా ఎగుమతులను నిలిపివేసిన నేపథ్యంలో కొవ్యాక్స్ కార్యక్రమానికి బ్రేకులు పడ్డ విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా టీకా కొరత కొంత మేర తగ్గి పేద దేశాలకు ఊరట లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. 18 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే ఈ టీకా వినియోగించేందుకు డబ్ల్యూహెచ్ఓ అనుమతించింది. ఈ టీకాకు వినియోగానికి సంబంధించి గరిష్ట వయోపరిమితి అంటూ ఏదీ లేదు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం.. వృద్ధుల్లోనూ ఈ టీకా వ్యాధిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-06-02T02:26:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising