ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WHO Announcement: ఇండియాకు 75లక్షల మోడెర్నా టీకాలు

ABN, First Publish Date - 2021-07-20T19:18:38+05:30

కరోనా మహమ్మారి రెండో వేవ్ రూపంలో భారత్‌ను అతలాకుతలం చేసింది. మూడో వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రెండో వేవ్ రూపంలో భారత్‌ను అతలాకుతలం చేసింది. మూడో వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీపి కబురు చెప్పింది. టీకా పంపిణీ కోసం కొవాక్స్ కార్యక్రమంలో భాగంగా ఇండియాకు 75లక్షల మోడెర్నా టీకాలు అందించనున్నట్టు డబ్ల్యూ‌హెచ్ఓ వర్గాలు వెల్లడించాయి. ‘ప్రపంచ వ్యాప్తంగా టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కొవాక్స్ కార్యక్రమం ద్వారా ఇండియాకు 7.5 మిలియన్ల మోడెర్నా వ్యాక్సిన్ డోసులను అందించనున్నాం’ అని ఓ ప్రకటనలో తెలిపాయి. ఇదిలా ఉంటే.. విదేశీ వ్యాక్సిన్ సంస్థలకు ఇండెమ్నిటీ అంశంపై భారత ప్రభుత్వం ఇంత వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ప్రభుత్వం వ్యాక్సిన్ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. 



ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ కేటాయించిన 75లక్షల మిలియన్‌ల మోడెర్నా డోసులు భారత్‌కు ఎప్పుడు చేరుతాయనేదానిపై స్పష్టత కరువైంది. ఇదిలా ఉంటే.. పలు నివేదికలు మూడో వేవ్ గురించి హెచ్చిరిస్తున్న క్రమంలో భారత ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంపై దృష్టి సారించింది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన 75లక్షల మిలియన్‌ల మోడెర్నా డోసులు భారత్‌కు చేరడం ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పుంజుకోనుంది. దీంతో మహమ్మారి వ్యాప్తిని కొంత మేరకు అడ్డుకునే అవకాశం ఉంది.


Updated Date - 2021-07-20T19:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising