ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరణ

ABN, First Publish Date - 2021-10-05T15:59:05+05:30

వాట్సాజ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు 7 గంటల తర్వాత వాట్సాప్ సేవలను పునరుద్ధరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వాట్సాజ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు 7 గంటల తర్వాత వాట్సాప్ సేవలను పునరుద్ధరించారు. వాట్సాప్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. సోమవారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో ఈ సోషల్ మీడియా నెట్ వర్క్ సేవలు  బంద్ అయ్యాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు, 4 గంటల సమయంలో వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తమ సేవలు పునరుద్ధరిస్తున్నామని రాత్రి 9:30 గంటల సమయంలోనే ఫేస్ బుక్ ప్రకటించినా.. ఈ సేవలు అందుబాటులోకి రావడానికి సుమారు 6 గంటలకుపైగా సమయం పట్టింది.


 ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఆ మూడు యాప్‌లు డౌన్‌ అయ్యాయి. దీంతో వాటిని నిత్యం వినియోగించే కోట్లాది మంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీనిపై చాలామంది నెటిజన్లు ట్విటర్‌ వేదికగా ఫిర్యాదుల వర్షం కురిపించారు. దీంతో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ నేతృత్వంలోని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ కంపెనీలు ట్విటర్‌లో స్పందించాయి.


‘‘మా యాప్‌లు, ఇతర ప్రొడక్ట్స్‌ను వినియోగించడంలో ఇబ్బంది కలుగుతోందని కొందరి నుంచి ఫిర్యాదులు అందాయి. సేవలను పునరుద్ధరించడంపైనే ప్రస్తుతం మేం పనిచేస్తున్నాం. సేవల్లో అంతరాయానికి చింతిస్తున్నాం’’ అని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి యాంటీ స్టోన్‌ రాత్రి 9 గంటల 37 నిమిషాలకు ట్వీట్‌ చేశారు. ఈ ప్రకటన వెలువడిన అర్ధగంట లేదా గంటలోగా సేవలు తిరిగి ప్రారంభమవుతాయని అంతా భావించారు. కానీ రాత్రి ఒంటి గంట దాటాక కూడా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తెరుచుకోలేదు. ఆ సమయానికి... ఫేస్‌బుక్‌ యాప్‌ను తెరిస్తే ‘సమ్‌థింగ్‌ వెంట్‌ రాంగ్‌.. ప్లీజ్‌ ట్రై అగైన్‌’ అని సందేశం వచ్చింది. వాట్సాప్‌లో మెసేజ్‌ను టైప్‌ చేసి సెండ్‌ చేస్తే బఫరింగ్‌ కొనసాగింది. ఇన్‌స్టాగ్రామ్‌ను తెరిచే ప్రయత్నం చేస్తే.. ‘కుడ్‌ నాట్‌ రిఫ్రెష్‌ ఫీడ్‌’ అనే సందేశం ప్రత్యక్షమైంది. అప్పటికి కూడా ఈ సేవలు ఎంతసేపట్లో అందుబాటులోకి వస్తాయో సంస్థలు వెల్లడించలేదు. ఎన్నడూలేని విధంగా ఈ మూడు యాప్‌ల సేవలు గంటల కొద్దీ స్తంభించడంపై సర్వత్రా నెటిజెన్లు విస్మయం వ్యక్తంచేశారు.  

Updated Date - 2021-10-05T15:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising