ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయలేం: వాట్సాప్

ABN, First Publish Date - 2021-05-17T23:02:05+05:30

తమ కొత్త ప్రైవసీ పాలసీ విధానాన్ని వాయిదా వేయలేమని మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ రోజు (సోమవారం) ఢిల్లీ హైకోర్టు వేదికగా స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమ కొత్త ప్రైవసీ పాలసీ విధానాన్ని వాయిదా వేయలేమని మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ రోజు (సోమవారం) ఢిల్లీ హైకోర్టు వేదికగా స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాట్సాప్ తరఫున ఢిల్లీ హైకోర్టులో సోమవారం వాదనలు వినిపించారు. తమ కొత్త ప్రైవసీ పాలసీ విధానాన్ని అంగీకరించని వారి ఖాతాలను దశల వారీగా తొలగిస్తామని తెలిపారు. ఈ విధానాన్ని వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. 


`మా నూతన పాలసీ ఐటీ నిబంధనలను అతిక్రమించడం లేదు. మేము పూర్తిగా నిబందనల ప్రకారమే వెళ్తున్నామ`ని సిబల్ కోర్టుకు చెప్పారు. ఈ కొత్త విధానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్(2000) లోని కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్‌ శర్మ కోర్టుకు చెప్పారు. ఈ కొత్త పాలసీపై వాట్సాప్ ఉన్నతాధికారులకు కేంద్రం లేఖ రాసిందని, సమాధానం కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. కాగా, వాట్సాప్ యథాతధ స్థితిని కొనసాగించాలని చేతన్ శర్మ, పిటీషనర్లు కోరగా.. హైకోర్టు నిరాకరించి విచారణను జూన్ 3కి వాయిదా వేసింది. 


Updated Date - 2021-05-17T23:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising