ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్ ధరించని ప్రయాణికుల నుంచి రూ. 21 లక్షలు జరిమానా వసూలు!

ABN, First Publish Date - 2021-04-21T21:13:21+05:30

మాస్కులు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారి నుంచి జరిమానా కింద రూ. 21.53 లక్షలు వసూలు చేసినట్టు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మాస్కులు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారి నుంచి జరిమానా కింద రూ. 21.53 లక్షలు వసూలు చేసినట్టు ఇవాళ పశ్చిమ రైల్వే వెల్లడించింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సంయుక్త సహకారంతో ఏప్రిల్ 20 వరకు రైల్వే శాఖ 12 వేల మందికి జరిమానా విధించినట్టు తెలిపింది. మంగళవారం నాటికి మొత్తం 12,824 మందికి జరిమానా విధించగా... అందులో కేవలం మార్చిలోనే 6,972 మంది మాస్క్ లేకుండా పట్టుబడినట్టు రైల్వేశాఖ పేర్కొంది. వీరి నుంచి 10,93,500 జరిమానా వసూలు చేసినట్టు వెల్లడించింది. ఫిబ్రవరిలో మాస్క్ ధరించకుండా ప్రయాణిస్తున్న 4,017 మంది నుంచి అధికారులు రూ.6,29,600 మేర జరిమానా వసూలు చేశారు. కాగా ఈ నెలలో నిన్నటి వరకు 1,835 మంది పట్టుబడగా.. వారి నుంచి రూ.4,30,500 వసూలు చేశారు.  మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 58,924 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వివిధ ఆస్పత్రుల నుంచి 52,412 మంది కోలుకోగా... 351 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2021-04-21T21:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising